Saturday, April 1, 2023
More
    HomelatestMEDAK | ఉద్యమం ముసుగులో తెలంగాణను ఆక్రమించిండ్రు: రేవంత్ రెడ్డి

    MEDAK | ఉద్యమం ముసుగులో తెలంగాణను ఆక్రమించిండ్రు: రేవంత్ రెడ్డి

    MEDAK, HUSNAABAD, REVANTH REDDY, JANA REDDY

    • బడుగు బలహీన వర్గాలను వే దిస్తున్నారు..
    • పాలకులపై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది
    • పాదయాత్రకు హాజరైన సీనియర్ నేత కందూరు జానారెడ్డి

    విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: తెలంగాణ ఉద్యమం ముసుగులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటూ వ్యాఖ్య‌లు చేశారు. హుస్నాబాద్ నియోజక వర్గంలోని సర్దార్ సర్వాయి పాపన్న కోటను ఆయ‌న ప‌రిశీలించారు. అనంత‌రం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

    ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న కాలంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని, పాలకులపై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందన్నారు.

    సర్దార్ సర్వాయి పాపన్న నివసించిన ప్రాంతాలను మైనింగ్ మాఫియాకు కట్టబెట్టాలని చూస్తే పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్ నాయకులు అడ్డుకున్నారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని బహుజనులకు అందించడానికి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు.

    కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని, సర్వాయి పాపన్న పాలించిన ప్రాంతాలను జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుందని హామినిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు గాను జీవిత చరిత్రను పాఠశాల సిలబస్ లో చేర్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ప్ర‌జ‌ల‌కు తెలిపారు.

    పాదయాత్రలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి

    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కట్కూరు వద్ద రేవంత్‌ చేపట్టిన హాత్ సే హాత్‌ జోడో యాత్రలో సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కందూరు జానారెడ్డి పాల్గొన్నారు.ఆయనతో పాటు భారీ నీటి పారుదల శాఖ మాజీ మంత్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజంన్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి,ప్రవీణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular