విధాత: ఒక్కోరోజు ఆపీసులో పని ఉత్సాహంగా సాగుతుంది. ఒక్కోసారి ఎంతకూ పని ముందుకు సాగదు. ఎందుకిలా? అనే అనుమానం అందరికీ ఏదో ఒక సందర్భంలో రాకుండా ఉండదు. చాలా మందికి అంతేనని అధ్యయనాలు రుజువులు చూపుతున్నాయి.
ఆఫీసు పనిలో ఉండే ప్రతి పది మందిలో ఆరుగురికి ఇలా జరుగుతుందట. ఇందుకు బ్రెయిన్ డ్రెయిన్ కారణమని అంటున్నారు. అసలు ప్రతి రోజు కొంత సమయం పాటు ఇలాంటి స్థితి ఉంటుందని ఒక అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనాన్ని రెంటల్ ఎజెన్సీ ఆఫీస్ ప్రీడం అనే సంస్థ దాదాపు 2000 మంది ఉద్యోగుల నుంచి ఓటింగ్ తీసుకుని ఈ సర్వే నిర్వహించింది. ఈ అధ్యయన ఫలితాలు చాలా అసక్తికరంగా ఉన్నాయి.
ఆఫీసుల్లో పని వేళల్లో ఉదయం 10. 22 గంటల సమయంలో చాలా చురుకుగా మంచి ప్రొడక్టివిటి సామర్థ్యం కలిగి ఉంటారట చాలా మంది. మధ్యాహ్నం 1.27 గంటల సమయం నుంచి కూడా నెమ్మదిగా నెమ్మదిస్తాయట. ఇక సమయం గడిచే కొద్ది 2.06 గంటల సమయానికి చేరేటప్పటికి మరింత దిగజారుతుందని అంటున్నారు.
కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం, తోటి వారు తరచుగా పనికి అంతరాయం కలిగించడం, తగినంత విరామం లేకపోవడం వంటివన్నీ కూడా స్విచ్ ఆన్ లో ఉండకపోవడానికి కొన్ని కారణాలట. చుట్టుపక్కల శబ్ధాలు, గదిలో ఫీలయ్యే వేడి, తోటి ఉద్యోగులు కలిగించే అంతరాయం, ఇతరుల సంభాషణలు, లేదా అనుమాన నివృత్తుల వంటివన్నీ కూడా పనిలో కాలయాపనకు కారణాలు అవుతున్నాయి.
సాధారణంగా వారం మొదట్లో ఎక్కువ ఉత్సాహంగా ఉంటారట. వారాంతానికి నెమ్మదిగా ఉత్సాహం సన్నగిల్లుతుందట. అందుకే వీకెండ్స్ లో ప్రొడక్టివిటి తగ్గుతుందని అంటున్నారు. ఒక వర్కింగ్ డేలో దాదాపు మూడు సార్లు అలసటగా ఉందనే కంప్లైంట్ చేస్తారు. ఆఫీసుల్లో పనితీరు మెరుగ్గా ఉండాలంటే మరి ఉద్యోగులను సౌకర్యంగా ఉంచడం అవసరం అని ఈ సర్వే చెబుతోంది.