HomelatestOG and Ustaad | ఏందయ్యా ఇది.. ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న పవర్ స్టార్!

OG and Ustaad | ఏందయ్యా ఇది.. ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న పవర్ స్టార్!

OG and Ustaad

విధాత‌: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో, వాటి అప్‌డేట్స్‌తో చెలరేగిపోతున్నాడు. పార్టీ నడపడం కోసం వేరే వ్యాపారాలు లేవని చెబుతున్న పవన్ కల్యాణ్.. తనకు తెలిసిన యాక్టింగ్‌నే నమ్మకుంటున్నాడు. రాబోయే ఎలక్షన్స్ లోపు.. వీలైనన్ని సినిమాలు చేసి.. చేతిలో కాసిన డబ్బులు ఉంచుకోవాలనేది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది.

దీని కోసం ఆయన అంతే ఇదిగా కష్టపడుతున్నారు. ఇప్పటికే అంగీకరించిన సినిమాలను పూర్తి చేసేందుకు ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారనేది.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మోగిపోతున్న అప్‌డేట్స్‌ను చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్స్‌ని ఊపిరి పీల్చుకోనివ్వనంతగా.. ఆయన సినిమాల అప్‌డేట్స్‌ని మేకర్స్ వదులుతున్నారు.

ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఫాజ్‌లో ఉండిపోయింది. ఈ చిత్ర చివరి షెడ్యూల్ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఈ లోపు పవన్, సుజీత్‌తో చేస్తున్న ‘ఓజీ’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

తాజాగా ఈ చిత్ర షెడ్యూల్ పూణేలో ప్రారంభమైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్‌ కూడా వెంటనే ప్రారంభించు కోవడంతో.. పవన్ కల్యాణ్ పరుగులు పెట్టిస్తున్నాడనే టాక్‌కు కారణమవుతోంది.

హీరోయిన్ ప్రియాంక మోహన్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ఓ పాటని, కొన్ని సన్నివేశాలని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అప్‌డేట్‌కే ఫ్యాన్స్ ఊగిపోతుంటే.. మరో వైపు హరీష్ శంకర్ తన సినిమా అప్‌డేట్‌ని కూడా వదిలి.. వారిని ఉక్కిరిబిక్కిరి చేశారు.

 

 

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గానే పవన్ కల్యాణ్ ఓ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.

ఈ రెండో షెడ్యూల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని హరీష్ ట్వీట్ చేశాడు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నాను.. అంటూ హరీష్ ట్వీట్ చేశాడు.

ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని హరీష్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా ఒకేసారి పవన్ కల్యాణ్ నటిస్తోన్న రెండు సినిమాల అప్‌డేట్స్‌తో సోషల్ మీడియా షేకవుతోంది. మరో విషయం ఏమిటంటే.. సుజీత్ చేస్తోన్న ‘ఓజీ’ చిత్రంలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ఓ పాత్ర చేయబోతున్నాడట.

ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ.. క్షణం తీరిక లేకుండా గడపడం ఆయన ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్‌ నిస్తోంది. ఆల్రెడీ పవన్ ‘PKSDT’ సినిమాని పూర్తి చేసిన విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular