OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. రాజకీయంగా ప్రజల సాధక బాధల్ని తెలుసుకుంటూ.. ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు వెళుతూనే ఉన్నాడు. సినిమాల పరంగా.. వకీల్ సాబ్, బ్రో వంటి చిత్రాలలో నటించడమే కాకుండా.. ఇప్పుడు మరో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. నాలుగో సినిమా కూడా రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న […]

OG |
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. రాజకీయంగా ప్రజల సాధక బాధల్ని తెలుసుకుంటూ.. ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు వెళుతూనే ఉన్నాడు. సినిమాల పరంగా.. వకీల్ సాబ్, బ్రో వంటి చిత్రాలలో నటించడమే కాకుండా.. ఇప్పుడు మరో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
నాలుగో సినిమా కూడా రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండు చిత్రాలు రెండు పార్ట్‌లుగా ఉండబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి ఏఎం రత్నం నిర్మిస్తూ క్రిష్ తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ కాగా.. రెండోది సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ‘OG’.
వీటిలో ‘హరిహర వీరమల్లు’ సినిమా పూర్తవడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది కాబట్టి.. ఆ సినిమా సంగతి పక్కన పెడితే.. పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ అందరూ OGపై బీభత్సమైన హోప్‌తో ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమాపై ఉన్న హైప్ అలా ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఒక పార్ట్ అని మాత్రమే టాక్ నడిచింది.
కానీ దర్శకుడు ఈ సినిమాని రెండు పార్ట్‌లుగా చూపించగల కంటెంట్‌ని రెడీ చేయడంతో.. నిర్మాత దానయ్య అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పార్ట్ 1లో పవన్ కళ్యాణ్ ఎక్కువ సేపు కనిపించడని, పార్ట్ 2లో మాత్రం పవన్ కళ్యాణ్ అణుబాంబ్‌లా పేలతాడని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని పట్టుకోవడం ఎవరితరం కాదు. ఎందుకంటే.. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ బర్త్‌డేని పురస్కరించుకుని వదిలిన OG గ్లింప్స్ అలా ఉంది మరి. గ్లింప్స్ కాదు.. గూజ్‌బంప్స్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
ఆ గ్లింప్స్ వీక్షించిన వారంతా.. ఈ సారి టాలీవుడ్ షేక్ అవడం ఖాయం అనేలా కామెంట్స్ చేస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో గ్లింప్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ లాంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
