యువకుడితో వృద్ధురాలి ప్రేమ.. అంతరిక్షంలోకి వెళ్లాలని.. చివరకు?
విధాత: అమ్మాయిలది నిఖార్సయిన ప్రేమ అని చెప్పడానికి ఈ లవ్ స్టోరీ ఒక ఉదాహరణ. ఒక్కసారి ప్రేమలో పడ్డారంటే జీవితాంతం మరిచిపోరు. అంత పిచ్చిగా అమ్మాయిలు ప్రేమించేస్తుంటారు. ప్రియుడి కోసం ప్రాణాలకైనా తెగిస్తుంటారు అమ్మాయిలు. ఆ విధంగానే ఓ వృద్ధురాలు కూడా తన వయసుతో సంబంధం లేకుండా ఓ యువకుడిని ప్రేమించింది.. అతనిపై మనసు పారేసుకుంది. అతను అడిగినంత డబ్బు కూడా ఇచ్చింది. కానీ చివరకు అతని చేతిలో మోసపోయింది. జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలి(65)కి ఇన్‌స్టాగ్రామ్‌లో […]

విధాత: అమ్మాయిలది నిఖార్సయిన ప్రేమ అని చెప్పడానికి ఈ లవ్ స్టోరీ ఒక ఉదాహరణ. ఒక్కసారి ప్రేమలో పడ్డారంటే జీవితాంతం మరిచిపోరు. అంత పిచ్చిగా అమ్మాయిలు ప్రేమించేస్తుంటారు. ప్రియుడి కోసం ప్రాణాలకైనా తెగిస్తుంటారు అమ్మాయిలు. ఆ విధంగానే ఓ వృద్ధురాలు కూడా తన వయసుతో సంబంధం లేకుండా ఓ యువకుడిని ప్రేమించింది.. అతనిపై మనసు పారేసుకుంది. అతను అడిగినంత డబ్బు కూడా ఇచ్చింది. కానీ చివరకు అతని చేతిలో మోసపోయింది.
జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలి(65)కి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తనకు తాను రష్యాకు చెందిన వ్యోమగామి అని పరిచయం చేసుకున్నాడు. ఆమెను నమ్మించేందుకు రష్యా స్పేస్ సెంటర్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. తాను నిన్ను ప్రేమిస్తున్నానని అతను చెప్పేసరికి, వృద్ధురాలి నిజమే అనుకొని నమ్మేసింది. నీకు ఐ లవ్ యూ అని 1000 సార్లు చెప్పినా తక్కువే.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు.
ఇక ఆమె కూడా అతని ప్రేమకు కరిగిపోయింది. ప్రస్తుతానికి అంతరిక్షంలో ఉన్నానని, భూమ్మీద్దకు తిరిగొచ్చిన వెంటనే నీతో కలిసి జీవించాలనుకుంటున్నాను. అందుకు రాకెట్ కొంటున్నానని, దానికి కావాల్సిన డబ్బు ఇవ్వమని కోరాడు. ఇంకేముంది.. వృద్ధురాలు తన కలల రాకుమారుడు రాకెట్‌లో వస్తాడనుకొని భావించి, దఫదఫాలుగా రూ. 25 లక్షలు పంపించేసింది. కానీ ఎంతకు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వృద్ధురాలికి పోలీసులు సూచించారు.
