Homelatestసమ్మెలపై.. KCR ప్రభుత్వం ధోరణి మార్చుకోవాలి: MLC అలుగుబెల్లి

సమ్మెలపై.. KCR ప్రభుత్వం ధోరణి మార్చుకోవాలి: MLC అలుగుబెల్లి

KCR | BRS | MLC NARSI REDDY

విధాత, ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక సంఘాలకు సమ్మె ఒక ప్రజాస్వామిక, రాజ్యాంగ ప్రాథమిక హక్కు అని సమ్మెలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం అణిచివేత వైఖరీ విడనాడాలని, సమ్మె పరిష్కారానికి బాధ్యతగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హితవు పలికారు. కలెక్టరేట్ ెదుట సమ్మె సాగిస్తున్న జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామని చెబుతూ భారీ విగ్రహాల ఆవిష్కరణలతో ప్రచార పటోపం చేసి అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో దక్కిన సమ్మె హక్కులపై అణచివేత విధానాన్ని అనుసరించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు.

సాక్షాత్ సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ అమలు, ఉద్యోగ నియామక ఒప్పందాల అమలు మాత్రమే పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారని అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యదర్శుల కృషితోనే ఈరోజు రాష్ట్రంలో అనేక గ్రామపంచాయతీలకు వివిధ పరిపాలన విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కాయన్న విషయాన్ని మరవరాదన్నారు.

పంచాయతీ కార్యదర్శుల సమ్మె పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి మానవతా, పరిపాలన బాధ్యతల కోణంలో స్పందించి వారి సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular