- ప్రతి నాలుగు గంటలకు ఒక వ్యక్తి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న వైనం
విధాత, మెదక్ బ్యూరో: క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవలసిన అవసరముందని జిల్లా వైద్యాధికారి చందులాల్ సూచించారు. శనివారం తన ఛాంబర్ లో క్యాన్సర్ కు సంబంధించిన ప్లిప్ చార్ట్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చందులాల్ మాట్లాడుతూ తొలిదశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించి పరీక్షలు చేసుకుంటే క్యాన్సర్ ను నివారించుకోవచ్చని చెప్పారు. మన దేశంలో ప్రతి ఏడు గంటలకు ఒక వ్యక్తి సర్వైకల్ క్యాన్సర్తో మరణిస్తున్నారని అన్నారు.
అదేవిధంగా ప్రతి నాలుగు గంటలకు ఒక వ్యక్తి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నకేసులు నమోదవుతుండడం బాధాకరమన్నారు. ఓరల్, క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి రకాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు టెస్ట్లు చేయించుకొని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కార్యక్రమాలలో సర్వే లైన్స్ ఆఫీసర్ నవీన్, యూనిసెఫ్ కోఆర్డినేటర్ గంగాధర్ గౌడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.