ఈ సమస్యతో బారిన ప్రపంచ జనాభాలో 17.5 శాతం మంది మద్యపానం, నైట్ షిఫ్ట్‌లే ప్రధాన కారణం Infertility | విధాత: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వంధ్యత్వం (Infertility) బాగా పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వయసులో ఉన్న మగవారిలో 17.5 శాతం మంది.. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తన తాజా నివేదికలో పేర్కొంది. గడిచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే వంధ్యత్వ బాధితుల సంఖ్య బాగా పెరిగిందని (WHO) తెలిపింది. […]

- ఈ సమస్యతో బారిన ప్రపంచ జనాభాలో 17.5 శాతం మంది
- మద్యపానం, నైట్ షిఫ్ట్‌లే ప్రధాన కారణం
Infertility | విధాత: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వంధ్యత్వం (Infertility) బాగా పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వయసులో ఉన్న మగవారిలో 17.5 శాతం మంది.. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తన తాజా నివేదికలో పేర్కొంది. గడిచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే వంధ్యత్వ బాధితుల సంఖ్య బాగా పెరిగిందని (WHO) తెలిపింది.
జీవనశైలిలో వచ్చిన విపరీత ధోరణులు, ఒత్తిడి, ఊబకాయం తదితరాలను ఈ పెరుగుదలకు కారణంగా అభిప్రాయపడింది. అంతే కాకుండా రాత్రి వేళ పని చేసే వారు ఎక్కువగా వంధ్యత్వం బారిన పడుతున్నారని స్పష్టం చేసింది. సంతానాన్ని పొందడానికి ఉపయోగపడే కొన్ని హార్మోన్‌లు తెల్లవారు జామున మాత్రమే విడుదలవుతాయని.. నిద్ర వేళలు మారిపోవడంతో ఈ సైకిల్ దెబ్బతింటోందని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.
దీని వల్ల వీర్య ఉత్పత్తికి దోహదపడే హార్మోన్లను విడుదల చేయడంలో మెదడు ఇబ్బందికి గురవుతందోని.. ఇది క్రమంగా వంధ్యత్వానికి దారి తీస్తోందని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. మితిమీరిన మద్యపానం, ధూమపానం కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణం. తీవ్రంగా మద్యపానం చేసే పురుషుల్లో చాలా మందికి స్త్రీల హార్మన్ అయిన ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. దీని వల్ల వృషణాల సైజు తగ్గిపోతోంది.
అంతే కాకుండా ఒక పురుషుడు చేసే వృత్తి అతడి లైంగిక సామర్థ్యాన్ని నిర్ణయిస్తోంది. అతి వేడి ప్రదేశాల్లో పని చేయడం, లాంగ్ డ్రైవ్‌లకు ఎక్కువగా వెళ్లే ఉద్యోగాలు, 4 గంటలకు పైగా కుర్చీలో కూర్చుని చేసే ఐటీ తరహా ఉద్యోగాలు చేసే వారిలో వృషణాల సామర్థ్యం తగ్గిపోతోంది. వైఫై నెట్వర్క్ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం, ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలు ఉండే చోట నివసించే వారిలోనూ వంధ్యత్వం ఛాయలు ఎక్కువగా కనపడుతున్నాయి.
పురుగుల మందులు ఎక్కువగా కొట్టే రైతులు కూడా ఈ సమస్య నుంచి తప్పించుకోలేరని డబ్ల్యూహెచ్ఓ నివేదిక హెచ్చరించింది. అంతే కాకుండా కండలు పెంచడానికంటూ విపరీతంగా జిమ్ చేయడమూ మంచిది కాదని సూచించింది. వారానికి 5 రోజులు.. రోజూ ఒక గంట పాటు వర్కౌట్లు చేస్తే చాలని తెలిపింది. స్టెరాయిడ్‌లు, హార్మన్ ఇంజక్షన్‌ల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడమే కాదని.. కొన్ని సార్లు సున్నాకు పడిపోవచ్చని తీవ్రంగా హెచ్చరించింది.
