విధాత‌: ప్రభాస్, కృతి హాసన్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్నా ఆదిపురుష్ (Adipurush) సినిమాకు సంబంధించి ఆ చిత్ర యూనిట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యే ప్రతి థియేటర్లో ఒక సీట్ ను ఖాళీగా ఉంచుతామని , ఆ సీట్ భగవాన్ హనుమకు రిజర్వ్ చేస్తి ఉంచుతున్నామని, హనుమాన్ వచ్చి ఆ సీట్లో ఆసీనులై తమ ప్రభువు అయిన శ్రీరామచంద్రులవారి చరితాన్ని చూసి తరిస్తారని , ఆ భక్తి […]

విధాత‌: ప్రభాస్, కృతి హాసన్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్నా ఆదిపురుష్ (Adipurush) సినిమాకు సంబంధించి ఆ చిత్ర యూనిట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యే ప్రతి థియేటర్లో ఒక సీట్ ను ఖాళీగా ఉంచుతామని , ఆ సీట్ భగవాన్ హనుమకు రిజర్వ్ చేస్తి ఉంచుతున్నామని, హనుమాన్ వచ్చి ఆ సీట్లో ఆసీనులై తమ ప్రభువు అయిన శ్రీరామచంద్రులవారి చరితాన్ని చూసి తరిస్తారని , ఆ భక్తి భావనతోనే ఒక సీట్ హనుమకు కేటాయించి దాన్ని ఖాళీగా ఉంచుతున్నామని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వేలాది ధియేటర్స్ లో ఈనెల 16న రిలీజ్ అవుతున్న చిత్రం మీద యూనిట్, ముఖ్యంగా ప్రభాస్ బాగా అసలు పెట్టుకున్నారు. గతంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రయిలర్ రిలీజ్ అయింది అయితే అది మరీ యానిమేషన్ సినిమా మాదిరిగా ఉందని, రావణుడి పాత్ర ధరి రూపురేఖలు సైతం బాలేవని, హనుమ కూడా ప్రజలకు నచ్చేలా లేడని అప్పట్లో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో చాలా పాత్రల రూపురేఖలు మార్చి మళ్లీ షూట్ చేసారు. మొత్తానికి ఏడాది లేటుగా ఇప్పుడు రిలీజ్ అవుతున్న చిత్రం ప్రభాస్ కు కీలకం కానుంది. ప్రభాస్ నటిస్తున్న తరువాతి చిత్రాల బిజినెస్, ఆయన ఇమేజి వంటివన్నీ ఆదిపురుష్ చిత్రం మీద ఆధారపడి ఉన్నాయ్.

Updated On 6 Jun 2023 1:00 PM GMT
somu

somu

Next Story