విధాత: ఊరందరిదీ ఒకదారి..ఉలిపిరి కట్టెది ఒకదారి అంటే ఇదేనేమో.. ప్రతిష్టాత్మక జీ-20 దేశాల కూటమికి భారత్ సారథ్యం వహిస్తున్న తరుణంలో దేశంలోని అన్ని ప్రధాన పార్టీలతో ఓ సదస్సు ఏర్పాటు చేసి అందులో భాగస్వాములను చేస్తే ఆ సదస్సుకు మన కేసీఆర్ ఒక్కరే పోలేదు. ఢిల్లీ పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఉంటూ రోజూ మోదీని, బీజేపీని తిట్టే అరవింద్ క్రేజీవాల్ సైతం సదస్సుకు వచ్చారు. బీజేపీని వెంటాడి వేటాడే సివంగి మమతా సైతం వచ్చి ప్రోటోకాల్ […]

విధాత: ఊరందరిదీ ఒకదారి..ఉలిపిరి కట్టెది ఒకదారి అంటే ఇదేనేమో.. ప్రతిష్టాత్మక జీ-20 దేశాల కూటమికి భారత్ సారథ్యం వహిస్తున్న తరుణంలో దేశంలోని అన్ని ప్రధాన పార్టీలతో ఓ సదస్సు ఏర్పాటు చేసి అందులో భాగస్వాములను చేస్తే ఆ సదస్సుకు మన కేసీఆర్ ఒక్కరే పోలేదు.

ఢిల్లీ పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఉంటూ రోజూ మోదీని, బీజేపీని తిట్టే అరవింద్ క్రేజీవాల్ సైతం సదస్సుకు వచ్చారు. బీజేపీని వెంటాడి వేటాడే సివంగి మమతా సైతం వచ్చి ప్రోటోకాల్ ప్రకారం ప్రధానిని, ఇంకా పెద్దలను కలిసి వెళ్లారు.ప్రధాని, బీజేపీ విధానాలను విమర్శించి వీధి పోరాటాలు చేసే సీపీఎం తరఫున సీతారాం ఏచూరి సైతం వచ్చారు. మోదీని దొంగ అంటూ హెచ్చరించిన చంద్రబాబు అయితే సరేసరి..వచ్చారు. మోడీ కరుణా కటాక్షాలు కోసం చూసారు ..వెళ్లారు.

మమతా బెనర్జీ..క్రేజీవాల్ వంటివారికి లేని అహం కేసీఆర్ మాత్రమే ఎందుకు అలా వ్యక్తం చేశారు. అంత అవసరం ఏమొచ్చింది. దేశంలోని ముఖ్యమంత్రులందరూ ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. కానీ ఒక్క తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రాలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

భారతదేశం పోషించాల్సిన పాత్రపై అన్ని రాజకీయ పార్టీల అధినేతల సూచనలను స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును భారతీయ జనతా పార్టీ సోమవారం తప్పుబట్టింది. జీ-20 దేశాల కీలక సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తుంటే ఈ కీలక మీటింగ్ కు రాకపోవడానికి కారణం ఏంటని నిలదీసింది.

కేసీఆర్ తనను తాను స్వతంత్ర దేశానికి చక్రవర్తిగా తెలంగాణను తన వ్యక్తిగత రాజ్యంగా భావిస్తున్నారా అని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు ఎన్నికైన ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన పాత్రను స్పష్టంగా కోల్పోయారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ భారత యూనియన్లో భాగం కాదనే భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అతను భారత రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన పాలనా నియమాలు విధులు ఉత్తమ పద్ధతుల పట్ల నిర్లక్ష్యం చూపాడని విమర్శించారు.

Updated On 6 Dec 2022 8:13 AM GMT
krs

krs

Next Story