విధాత‌: పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని పలు రాష్ట్రాల ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్‌ ప్రభుత్వం దీనిపై హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని ఆచరణలో అమలు చేయలేదు. దీంతో ఉద్యోగులు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉద్యోగులు పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని చాలాకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం సరైన స్పందన రావడం లేదు. అయితే హిమాచల్‌ […]

విధాత‌: పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని పలు రాష్ట్రాల ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్‌ ప్రభుత్వం దీనిపై హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని ఆచరణలో అమలు చేయలేదు. దీంతో ఉద్యోగులు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉద్యోగులు పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని చాలాకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం సరైన స్పందన రావడం లేదు.

అయితే హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు తమకు అవకాశం ఇస్తే పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్దరిస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పెట్టింది. హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పాత పింఛన్‌ విదానాన్ని పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది.

దీనివల్ల సుమారు 1.36 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు లబ్ధి జరగనున్నది. ఓపీఎస్‌ శుక్రవారం నుంచే అమల్లోకి రానున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ త్వరలోనే జారీ చేస్తామని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దీనిపై చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ తాను ఇచ్చిన వాగ్దానాన్ని చిన్న రాష్ట్రం, పర్యాటకం, ఆపిల్‌ తోటల పెంపకం వంటి ఆదాయ మార్గాలు ఉన్నచోట అమలు చేస్తున్నది. అలాగే మహిళలకు ప్రతి నెల రూ. 1500 ఇస్తామన్న మాటను కూడా నిలబెట్టుకునేందు సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

కానీ దేశాన్ని మన సంక్షేమ పథకాలు ఆదర్శమని పదే పదే చెప్పుకునే కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల ఓపిస్‌ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలు, వర్గాలతో పాటు ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్పా వారి న్యాయమైన ఓపీఎస్‌ డిమాండ్‌పై మీనమేషాలు లెక్కించడంపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు.

కాబట్టి మనది ధనిక రాష్ట్రంగా గర్వంగా చెప్పుకునే కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగుల పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్దరించాలని వారు కోరుతున్నారు. అప్పుడే మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ఫ్రభుత్వం అంటే విశ్వసిస్తారు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో తమ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తున్నారు.

అలాగే ప్రభుత్వ ఉద్యోగుల, పింఛన్‌దారుల పట్ల సానుకూల వైఖరితో ఉన్నది. హిమాచల్‌ప్రదేశ్‌ లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్‌ పై తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని హామీ ఇస్తే కేసీఆర్‌ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో కష్టకాలమే అంటున్నారు. కనుక ఓపీఎస్‌పై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని ఎన్నికలకు ముందే దాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.

Updated On 16 Jan 2023 2:24 AM GMT
krs

krs

Next Story