ORIGIN DAIRY ఎమ్మెల్యే చేసిన అన్యాయం వివరిస్తూ హైదరాబాద్, ఢిల్లీలో ఫ్లెక్సీలతో నిరసన జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తమకు ప్రాణహాని ఉందని ఆరిజన్ డెయిరీ సీఈవో శేజల్ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవన్ ఎదుట ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమకు అన్యాయం చేశాడని, మా వద్ద అక్రమంగా డబ్బులు తీసుకుని మాపైనే అక్రమ […]

ORIGIN DAIRY

  • ఎమ్మెల్యే చేసిన అన్యాయం వివరిస్తూ హైదరాబాద్, ఢిల్లీలో ఫ్లెక్సీలతో నిరసన
  • జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తమకు ప్రాణహాని ఉందని ఆరిజన్ డెయిరీ సీఈవో శేజల్ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవన్ ఎదుట ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేసింది.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమకు అన్యాయం చేశాడని, మా వద్ద అక్రమంగా డబ్బులు తీసుకుని మాపైనే అక్రమ కేసులు మోపి జైలుకు పంపాడని శేజల్ ఆరోపించింది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యే తన అధికార దర్పాన్ని ఉపయోగించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయింది.

హైదరాబాదులోని సచివాలయంతో పాటు అనేక ప్రాంతాల్లో నిరసన ఫ్లెక్సీలు ప్రదర్శించినప్పటికీ న్యాయం జరగడం లేదని తెలంగాణ రాష్ట్రంలో తమకు న్యాయం జరగద‌ని నిర్ణ‌యించుకొని, ఏకంగా ఢిల్లీ నూతన పార్లమెంట్ ముందు ఫ్లెక్సీలతో నిరసన తెలిపినట్లు బాధితురాలు పేర్కొంది.

రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆరిజిన్ డెయిరీ సంస్థ బెల్లంపల్లిలో ప్రారంభించామని, ఎమ్మెల్యే చిన్నయ్య అడిగితే వాటా కూడా ఇచ్చామని శేజల్ వెల్లడించింది.

గత ఏడాది ఆగస్టు 8న ఆరిజన్ డెయిరీ ప్లాంట్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూమిని అప్పజెబుతానని తమ నుంచి రూ.30 లక్షలు అక్రమంగా తీసుకొని ఆపై మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

పైగా అమ్మాయిలను పంపాలని ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేశాడని శేజల్ ఆరోపించింది. ఆ పనికి నిరాకరించడంతో మాపై కక్ష పెంచుకొని తనతో పాటు తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులను పెట్టించి జైలుకు పంపారని బాధితురాలు శేజల్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది.

ఎక్కడా న్యాయం జరగకపోవడంతో చివరికి దుర్గం చిన్నయ్య తనకు చేసిన అన్యాయంపై ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు అరిజన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ తెలిపింది. జాతీయ మహిళా కమిషన్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.

Updated On 30 May 2023 1:33 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story