Dasyaam Vinay Bhaskar |
- హనుమకొండలో మే 31న కార్మిక యుద్ధభేరి
- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల సాధనకు ఓరుగల్లు కేంద్రంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ (Govt Chief Whip Dasyaam Vinay Bhaskar) ప్రకటించారు. తొమ్మిది సంవత్సరాలైనా విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో వినయ్ భాస్కర్
మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ బయ్యారం ఫ్యాక్టరీ అన్ని పోరుగల్లు జిల్లాకు సంబంధించిన అంశాలంటూ వివరించారు. ఈ డిమాండ్ల సాధన కోసం రానున్న కాలంలో కార్మిక లోకం నడుం బిగించి ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.
కార్మిక చైతన్య మాసోత్సవాల సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం ఆవరణలో మే 31న అన్నీ కార్మిక సంఘాలతో యుద్ధభేరి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రులు హాజరవుతారని తెలిపారు.
గ్రామీణ ఉపాధి హామీ వలే పట్టణ ఉపాధి హామీ చట్టంను కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించడానికి పాటు పడితే కేంద్రం అమ్ముతున్నదని ఆయన విమర్శించారు.
గత సంవత్సరం నిర్వహించిన కార్మిక చైతన్య మాసోత్సవం వలన కార్మిక విభాగం ద్వారా 6,914 మంది కార్మికులకు లబ్ధి జరిగింది అని ఆయన తెలిపారు. కార్మికుల సంక్షేమo కోసం 33జిల్లా కేంద్రలలో కార్మిక భవనానికి స్థలంను సీఎం కెసిఆర్ మంజూరు చేశారని వివరించారు.
కాగా.. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు 23రకాల వ్యాధులకు పరీక్షలు ఏడాది పాటు చేస్తామని చెప్పారు. కార్మికుల పిల్లలను రెసిడెన్సీ, ప్రభుత్వ పాఠశాలలో చేర్చి ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వినయ్ భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.