Oscar Awards | ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల పండుగ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానున్నది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా అవార్డుల వేడుక జరుగనున్నది. కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పలు వేదికలు సిద్ధమయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 8 గంటలకు వేడుకలు మొదలవున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాటు పూర్తి చేశారు. అయితే, భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 5.30 గంటల […]

Oscar Awards | ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల పండుగ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానున్నది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా అవార్డుల వేడుక జరుగనున్నది. కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పలు వేదికలు సిద్ధమయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 8 గంటలకు వేడుకలు మొదలవున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాటు పూర్తి చేశారు.
అయితే, భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ సారి RRR సినిమా సైతం అవార్డుకు పోటీపడుతున్నది. ఈ క్రమంలో తెలుగు ప్రజలతో పాటు భారతీయులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చిత్రంలోని ‘నాటునాటు’ పాట తుది నామినేషన్లలో నిలువడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక ఈ అవార్డుల వేడుకను పలు వేదికలు లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఏబీసీ నెట్‌వర్క్ యూట్యూబ్, హులు లైవ్ టీ, డైరెక్ట్ టీవీ, ఫుబో టీవీ, ఏటీఅండ్‌టీ టీవీ అవార్డుల ప్రదానం వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వీటితో పాటు ఏబీసీడాట్‌కామ్ (ABC.COM), ఏబీసీ యాప్ (ABC App) అవార్డుల వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. ఆస్కార్ అవార్డుల్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో నాటు నాటు సాంగ్ ఫైనల్ నామినేషన్‌లో నిలిచిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీ తుది నామినేషన్‌లో నిలిచింది. అప్లాస్ (Applause- Tell it like a woman), హోల్డ్ మై హ్యాండ్ ( Hold My Hand- Top Gun Maverick), లిఫ్ట్ మీ అప్ (Lift Me Up - Black Pather Wakanda Forever), దిస్ ఈజ్ ఏ లైఫ్ (This is a life - Everything Everywhere all at once) పాటలు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్‌తో పోటీపడుతున్నాయి.
