Suryapet | భూమి కోసం భార్య భర్తల మధ్య చిచ్చు మూణ్ణెల్ల బాబుకు దూరమైన తండ్రి వినకపోతే దాడులు.. బెదిరింపులు మరో బాధితుడు మధుకర్ రెడ్డి ఆవేదన విధాత: జానయ్య అరాచకల్లో మరో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ధనం, ఆస్తులను అక్రమంగా కూడబెట్టుకునేందుకు దంపతుల మధ్య గోడవలు పెడుతున్నాడు. మహిళలు, చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట పిల్లలమర్రి గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన లింగారెడ్డి కూతురుతో వివాహం అయింది. […]

Suryapet |
- భూమి కోసం భార్య భర్తల మధ్య చిచ్చు
- మూణ్ణెల్ల బాబుకు దూరమైన తండ్రి
- వినకపోతే దాడులు.. బెదిరింపులు
- మరో బాధితుడు మధుకర్ రెడ్డి ఆవేదన
విధాత: జానయ్య అరాచకల్లో మరో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ధనం, ఆస్తులను అక్రమంగా కూడబెట్టుకునేందుకు దంపతుల మధ్య గోడవలు పెడుతున్నాడు. మహిళలు, చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట పిల్లలమర్రి గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన లింగారెడ్డి కూతురుతో వివాహం అయింది.
వివాహానంతరం తన మామ లింగారెడ్డి వద్దనే 2015లో అర ఎకరం భూమిని మధుకర్ కొనుగోలు చేశాడు. ఆ భూమిపై కన్నేసిన జానయ్య.. తన అనుచరులతో భూమిపై కేసు వేయించి తమ మధ్య అగ్గి రాజేశాడని మధుకర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ‘నేను చెప్పినట్లు వింటేనే నీ పెళ్ళాం నీతో వస్తుంది.. లేక పోతే రాదు’ అంటూ బెదిరించాడని ఆయన వాపోయారు.
అప్పటికే మధుకర్ రెడ్డి దంపతులకు మూడు నెలల బాబు ఉన్నాడు. జానయ్య బెదిరింపులకు భయపడక పోవడంతో తనపై విచక్షణ రహితంగా దాడి చేశాడని మధుకర్‌రెడ్డి చెప్పారు. అయినా తన అర ఎకరం భూమిని వదులు కోవడానికి ఇష్టపడలేదని తెలిపారు. అప్పటి నుండి తన కుటుంబానికి దూరంగా ఉంటున్నానని, గొడవ జరిగినప్పుడు బాబు వయసు మూడు నెలలు ఉంటే.. ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాలని చెప్పారు.
జానయ్య భూ దాహానికి కన్న కొడుకును చూడడానికి కూడా నోచుకోలేదని వాపోయారు. జానయ్య పాపం ఇన్నాళ్లకు పండిందని బాధితుడు మధుకర్ రెడ్డి అన్నారు. త్వరలోనే పిల్లలను కలుస్తానని అంటున్నాడు.. తన లాంటి ఎంతో మందిని మానసికంగా, శారీరకంగా హింసించిన జానయ్య ను ప్రభుత్వం, పోలీసులు కఠినంగా శిక్షించాలని బాధితుడు మధుకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు.
