OU JAC | బేషరతుగా లొంగిపోయి , బాధితులకు న్యాయం చేయాలని ఓయూ జెఏసి అల్టిమేటం ఎక్కడ దాక్కున్నా పట్టుకుని బుద్ది చెబుతాం అంటూ వార్నింగ్ పార్టీలకతీతంగా బాధితులకు అండగా ఉండాలని డిమాండ్ బహుజనవాదం ముసుగులో జానయ్య అక్రమాలపై కన్నెర్ర సూర్యాపేట: నయా నయూం వట్టే జానయ్య యాదవ్ బాధితులకు ఓయూ జేఏసి విద్యార్థులు బాసటగా నిలిచారు. ఈరోజు సూర్యాపేటలో పర్యటించిన జెఏసి నేతలు బాధితులను కలవడంతో పాటు క్షేత్ర స్థాయి లో తిరుగుతూ జానయ్య అక్రమాలను […]

OU JAC |

  • బేషరతుగా లొంగిపోయి , బాధితులకు న్యాయం చేయాలని ఓయూ జెఏసి అల్టిమేటం
  • ఎక్కడ దాక్కున్నా పట్టుకుని బుద్ది చెబుతాం అంటూ వార్నింగ్
  • పార్టీలకతీతంగా బాధితులకు అండగా ఉండాలని డిమాండ్
  • బహుజనవాదం ముసుగులో జానయ్య అక్రమాలపై కన్నెర్ర

సూర్యాపేట: నయా నయూం వట్టే జానయ్య యాదవ్ బాధితులకు ఓయూ జేఏసి విద్యార్థులు బాసటగా నిలిచారు. ఈరోజు సూర్యాపేటలో పర్యటించిన జెఏసి నేతలు బాధితులను కలవడంతో పాటు క్షేత్ర స్థాయి లో తిరుగుతూ జానయ్య అక్రమాలను చూసి నివ్వెర పోయారు. వంద మంది బాధితుల కష్టాలను చూసి జానయ్య కీచక పర్వాల పై కోపోద్రిక్తులయ్యారు.

జా నయ్య యాదవ్ తప్పు చేయకపోతే అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. రాజకీయాలను పక్కన పెట్టి వెంటనే బేషరతుగా లొంగిపోయి , బాధితులకు న్యాయం చేయాలని ఓయూ జెఏసి విద్యార్థులు అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో వందలాది మందిగా విద్యార్థులం రంగంలోకి దిగి ఎక్కడ దాక్కున్నా పట్టుకుని బుద్ది చెబుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

పార్టీలకతీతంగా బాధితులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు..బహుజనవాదం ముసుగులో జానయ్య చేసిన అక్రమాలపై కన్నేర చేశారు. బాదితులను కలిసిన వారిలో టి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ అంజి యాదవ్, మల్లేపల్లి శివ, గోసంగి శ్రీను, పేర్ల అంబెధ్కర్, చిరంజీవి, సంతూ యాదవ్, హుసేన్, ఓయూ జెఏసి నేతలు ఉన్నారు.

Updated On 1 Sep 2023 5:24 PM GMT
krs

krs

Next Story