OU | కాంగ్రెస్ కు ఉద్యమ నేతల వినతి విధాత: ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలు కోరారు. ఈమేరకు మంగళవారం గాంధీభవన్ లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ కి గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తామని […]

OU |

కాంగ్రెస్ కు ఉద్యమ నేతల వినతి

విధాత: ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలు కోరారు. ఈమేరకు మంగళవారం గాంధీభవన్ లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ కి గౌడ్ కు వినతిపత్రం అందజేశారు.

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తామని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. టీఆర్ఎస్ 2014లో ఒక ఎంపీ, 3 అసెంబ్లీ టికెట్లు విద్యార్థి ఉద్యమకారులకు కేటాయించిందని, 2018లో మూడు అసెంబ్లీ టికెట్లు, 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఈసారి విద్యార్థి ఉద్యమకార్లకు న్యాయం చేయాలని వారు కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సత్తుపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్న కోటూరి మానవతారాయ్, చెన్నూరు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న దుర్గం భాస్కర్, జనగామ నుంచి టికెట్ ఆశిస్తున్న బాల లక్ష్మి, గద్వాల నుంచి టికెట్ ఆశిస్తున్న కురువ విజయ్ కుమార్,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మునుగోడు నుంచి టికెట్ ఆశిస్తున్న డాక్టర్ లింగం యాదవ్, కరీంనగర్ నుంచి కొనగాల మహేష్ ఉన్నారు.

Updated On 29 Aug 2023 2:42 PM GMT
krs

krs

Next Story