OUTA విధాత : యూనివర్సిటీ అధ్యాపకుల పెండింగ్ సమస్యలైన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) అమలుకు, పీఆర్సీ బకాయిల చెల్లింపుకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ చర్యలు తీసుకోవాలని ఔట అధ్యక్షులు ప్రొఫెసర్ బీ. మనోహర్, ప్రధాన కార్యదర్శి, బీ. సురేందర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ సైన్స్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీఏఎస్ పదోన్నతులలో జరిగిన అవక తవకలతో పాటు, విశ్వ విద్యాలయ భూముల కబ్జా వంటి సమస్యలపై వీసీ చర్యలు […]

OUTA
విధాత : యూనివర్సిటీ అధ్యాపకుల పెండింగ్ సమస్యలైన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) అమలుకు, పీఆర్సీ బకాయిల చెల్లింపుకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ చర్యలు తీసుకోవాలని ఔట అధ్యక్షులు ప్రొఫెసర్ బీ. మనోహర్, ప్రధాన కార్యదర్శి, బీ. సురేందర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ సైన్స్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీఏఎస్ పదోన్నతులలో జరిగిన అవక తవకలతో పాటు, విశ్వ విద్యాలయ భూముల కబ్జా వంటి సమస్యలపై వీసీ చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో మాట్లాడిన పలువురు ప్రొఫెసర్లు పదోన్నతుల్లో తలెత్తిన అన్యాయాలను, అవకతవకల్ని, వీసీ ఏకపక్ష ధోరణిని, నిరంకుశత్వాన్ని ఎండగట్టారు. కొంత మంది సీనియర్ ప్రొఫెసర్లుగా తమను ఎంపిక చెయ్యకుండా వీసీ ఎలా మిత్ర ద్రోహానికి పాల్పడ్డాడో తమ స్వీయ అనుభవాలను వివరించడంతో సభ్యులకు జరిగిన అన్యాయాలపై సమావేశం ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల సీఏఎస్ లో అధ్యాపకులకు జరిగిన అన్యాయం పై ప్రాతినిధ్యం చేసిన ఔట అధ్యక్షులని వీసీ వివరణ అడగడంను సర్వసభ్య సమావేశం తీవ్రంగా ఖండించింది.
దీనిని వీసీ వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిచో ఉపాధ్యాయులు ఉద్యమించే సమయం ముందు ఉందని సర్వసభ్య సమావేశం తీర్మానించింది. అదేవిధంగా సీపీఎస్ అమలుకు కావాల్సిన నిధులను విశ్వ విద్యాలయ అంతర్గత నిధుల నుండి సమకూర్చి సీపీఎస్ ను వెంటనే అమలు చెయ్యాలని సర్వసభ్య సమావేశం తీర్మానించింది. పీఆర్‌సీ పెండింగ్ బకాయిలను విడుదల చెయ్యాలని, భూముల సంరక్షణకు వెంటనే సమగ్రమైన చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయుల వయే పరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది.
తీర్మానాలపై వెంటనే వీసీ ప్రతిస్పందించి సానుకూల చర్యలు తీసుకోకపోతే వీసీ నిరంకుశత్వాన్ని పక్షపాత ధోరణిని వివిధ ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, న్యాయంగా దక్కాల్సిన హక్కులను, వనరులను సాధించేందుకు ఔట తీసుకొనే అన్ని ఆందోళన కార్యక్రమంలో సభ్యులందరు పాల్గొంటామని ముక్త కంఠంతో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ ప్రొఫెసర్లు అప్పా రావు, టీ. కృష్ణారావు, ఏ.వి. రాజశేఖర్, ఎన్. కిషన్, నారాయణ, నతానియల్, ఏ. వెంకట లక్ష్మీ, రోజా రాణిలు, డాక్టర్ టి. గంగాధర్, డాక్టర్ ఎం.రాధాకృష్ణ, రాజు పాడ్యా తదితరులు పాల్గొన్నారు.
