Nalgonda |
- మత్తడి దూకిన కృష్ణమ్మ పరవళ్లు
- నడి వేసవిలో కృష్ణవేణి దూకుడు
విధాత: ఉదయ సముద్రం చెరువు నిండు కుండలా మారగా కృష్ణమ్మ మత్తడి దూకి దిగువకు పరవళ్లు తొక్కింది. ఏఎంఆర్పీ ప్రాజెక్టు కాలువ ద్వారా కృష్ణా జలాలతో ఉదయ సముద్రం చెరువు రిజర్వాయర్ పూర్తిగా నిండింది. అలుగు మీదుగా జాలు వారుతున్న కృష్ణవేణి సోయగాలను వీక్షించేందుకు నల్గొండ పట్టణవాసులు రిజర్వాయర్ కట్ట ట్యాంక్ బండ్ మీదకు చేరుతున్నారు.
నల్గొండ మున్సిపాలిటీ తో పాటు 400 గ్రామాలకు పైగా తాగునీరు, ఏఏమ్మార్పిపి కాలువల డిస్టిబ్యూటరీల పరిధిలోని ఆయకట్టుకు, ఉదయం సముద్రం ఎత్తిపోతల పథాకానికి ఆధారమైన ఉదయ సముద్రం రిజర్వాయర్ పూర్తిగా జలకలతో అలరారుతు ఆలుగు పోస్తుంది. నడి వేసవిలో పూర్తిగా జలకళ తో కనువిందు చేస్తున్న ఉదయం సముద్రం జలదృశ్యాలను నల్లగొండ పట్టణ వాసులు వీక్షిస్తూ మనోల్లాసాన్ని పొందుతుండగా సందర్శకుల రాకతో రిజర్వాయర్ పరిసరాలు సందడిగా కనిపిస్తున్నాయి.