విధాత: రిపబ్లిక్‌ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాలలో విశేష సేవలు అందించిన 106 మంది ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది పద్మవిభూషణ్‌ అవార్డు ఆరుగురిని వరించింది. ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్‌ మహలనబిస్‌కు వైద్యరంగంలో మరణానంతరం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. రాజకీయ మల్లయోధుడు ములాయం సింగ్‌కు కూడా ఈ అవార్డు లభించింది. వీరితోపాటు ఎస్‌.ఎం.కృష్ణ, బాలకృష్ణ దోషి, శ్రీనివాస వరదాన్‌, జాకిర్‌ […]

విధాత: రిపబ్లిక్‌ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాలలో విశేష సేవలు అందించిన 106 మంది ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది పద్మవిభూషణ్‌ అవార్డు ఆరుగురిని వరించింది.

ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్‌ మహలనబిస్‌కు వైద్యరంగంలో మరణానంతరం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. రాజకీయ మల్లయోధుడు ములాయం సింగ్‌కు కూడా ఈ అవార్డు లభించింది. వీరితోపాటు ఎస్‌.ఎం.కృష్ణ, బాలకృష్ణ దోషి, శ్రీనివాస వరదాన్‌, జాకిర్‌ హుస్సేన్‌ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

చిన్నజియర్‌స్వామి. కమలేశ్‌ డి పటేల్‌లకు పద్మభూషణ్‌, గిరిజన, దక్షిణాది భాషలకు అనేక సేవలు అందించిన తెలంగాణకు చెందిన బి. రామకృష్ణారెడ్డి, పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నందుకు కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్‌, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణితో పాటు ఏపీకి చెందిన కోట సచ్చిదానంద శాస్త్రి, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ప్రకాశ్‌ చంద్రసూద్‌, పద్మశ్రీ అవార్డు వరించింది.

Updated On 25 Jan 2023 4:44 PM GMT
krs

krs

Next Story