Homeవార్త‌లుPan - Aadhaar Link | పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేశారా..? లేకుంటే.. జూలై 1...

Pan – Aadhaar Link | పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేశారా..? లేకుంటే.. జూలై 1 నుంచి ఈ పది పనులు చేయలేరు..!

Pan – Aadhaar Link |

విధాత: ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మరో ఐదురోజుల్లో ముగియనున్నది. మార్చి 31తో కీలకమైన ఐదు పనులకు సైతం గడువు తీరనున్నది. ఇందులో పాన్‌ – ఆధార్‌ కార్డ్‌ లింక్‌ ఒకటి. ఇప్పటి వరకు పాన్‌ – ఆధార్‌ లింక్‌ చేయకపోతే వెంటనే చేసుకోండి. చేసినా మరోసారి వేరిఫై చేసుకోండి.

పాన్‌ – ఆధార్‌ అనుసంధానం చేయకపోతే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మీ పాన్‌ కార్డ్‌ చెల్లదని కేంద్రం తెలిపింది. అనంతరం ఆ తేదీని జూన్‌ 30 వరకు గడువును పెంచింది. ఆర్థిక లావాదేవీల్లో పాన్‌ కార్డ్‌ కీలకమైందని అందరికీ తెలిసిన విషయమే. ఓ వ్యక్తికి ప్రత్యేక గుర్తింపుగా ఇది పని చేస్తుంది.

PAN – Aadhaar Link: ఆధార్‌‌తో.. పాన్ కార్డ్‌ లింక్! డెడ్‌లైన్ జూన్‌ 30 వరకు పొడిగింపు

అదే సమయంలో పాన్‌ లేకపోతే ఇకపై ఎక్కువగా పన్నులు చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. రూ.50వేల కంటే ఎక్కువగా లావాదేవీలు చేయలేరు. అదే సమయంలో పలు ఇబ్బందులను సైతం ఎదుర్కోవాల్సి రానున్నది.

అదే సమయంలో మరింత టీడీఎస్‌ చెల్లించాల్సి రావడంతో పాటు తగ్గించిన టీడీఎస్‌ను క్లెయిమ్‌ చేసుకోవడంలో తిప్పలు తప్పకపోవడంతో పాటు బ్యాంకు ఖాతాలో జమ కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తప్పనిసరిగా జూన్‌ 30, 2023 తేదీలోగా పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోండి. లేకపోతే పది కీలకమైన పనులు నిలిచిపోతాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం రండి మరి..!

పాన్‌ – ఆధార్‌ లింక్‌ చేయకపోతే ఈ పది పనులు చేయలేరు..!

  1. వాహనాలు కొనుగోలు చేయలేరు. మోటార్‌ వాహన బీమా కూడా అందుబాటులో ఉండదు.
  2. రూ. 50వే కంటే తక్కువ, టైమ్ డిపాజిట్ ఖాతా, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తప్ప మరే ఖాతా తెరిచేందుకు అనుమతి ఉండదు.
  3. క్రెడిట్-డెబిట్ కార్డ్, డీమ్యాట్ ఖాతా కోసం దరఖాస్తు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  4. మ్యూచువల్ ఫండ్స్‌లో 50వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు.
  5. ఆర్‌బీఐ బాండ్లు, కంపెనీ బాండ్లు లేదంటే డిబెంచర్లు కొనుగోలు చేయడానికి ఒకేసారి రూ.50వేల కంటే ఎక్కువ ఖర్చు చేయడం ఇక కష్టమే.
  6. బ్యాంకింగ్ కంపెనీ లేదంటే కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఒక్క రోజులో రూ.50వేల మించకుండా నగదు డిపాజిట్లు చేయలేరు.
  7. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో జీవిత బీమా ప్రీమియంల చెల్లింపుల్లో ఇబ్బందులు తప్పవు.
  8. రూ.10లక్షల కంటే ఎక్కువ విలువైన స్థిరాస్తిని కొనలేరు. అదే సమయంలో విక్రయించనూ లేరు.
  9. ఒక్కో లావాదేవీకి రూ.2 లక్షల కంటే ఎక్కువ వస్తువులు కొనడం, కొనుగోలు విక్రయించడంలో ఇబ్బంది.
  10. విదేశాలకు వెళ్లేటప్పుడు ఒకేసారి రూ.50వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపు చేయలేరు.

లింక్‌ చేశారా? లేదా? తెలుసుకోండిలా..

  • ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ http://incometax.gov.in లేదా http://incometaxindia.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి.
  • వెబ్‌సైట్ కుడి వైపున ‘క్విక్‌ లింక్‌లు’ కనిపిస్తాయి. ఇందులో లింక్‌ ఆధార్‌ స్టేట్‌ కనిపిస్తుంది.
  • ఇక్కడ లింక్‌ పాన్‌ అండ్‌ ఆధార్‌ చూపిస్తుంది.
  • ఇందులో పాన్‌, ఆధార్‌ పాన్‌ నంబర్లను ఎంటర్‌ చేసి వ్యాలిడేషన్ బటన్‌ క్లిక్‌ చేయాలి.
  • తర్వాత స్టేటస్‌ సక్సెస్‌ ఫుల్‌గా చేసి ఉంటే ఆల్‌రెడీ లింక్డ్‌ అని చూపిస్తుంది.
  • ఆధార్‌ – పాన్‌ లింక కాకపోతే.. క్విక్‌ లింక్‌లోకి వెళ్లి.. లింక్‌ ఆధార్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత పాన్‌ నంబర్‌, పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేయాలి.
  • అనంతరం వెరిఫై బటన్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఓ పాప్‌ అప్‌ ఓపెన్‌ అవుతుంది. స్టేటస్‌ను చూపిస్తుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద కొండచిలువ.. ఇంట్లో హల్‌ చల్‌

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular