Panos Panay కొత్త సీపీవోగా రాజేశ్‌ ఝా నియామకం కాలిఫోర్నియా: మైక్రోసాఫ్ట్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ.. చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న పనోస్ పనాయ్ రాజీనామా చేశారు. ఆయన అమెజాన్‌ హార్డ్‌వేర్‌ బిజినెస్‌ సూపర్‌వైజర్‌గా చేరనున్నారు. పనాయ్ రాజీనామా విచారించదగ్గ విషయమని, కంపెనీ హార్డ్‌వేర్‌, విండోస్ డివిజన్‌లకు తీరని లోటని మైక్రోసాఫ్ట్‌ పేర్కొన్నది. 2004 నుండి పనాయ్ మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నారు. 2012లో మొదటిసారి మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ హార్డ్ వేర్ ఉత్పత్తికి, ప్రాథమికంగా వెలువడిన టాబ్లెట్స్ కూడా సర్ […]

Panos Panay

  • కొత్త సీపీవోగా రాజేశ్‌ ఝా నియామకం

కాలిఫోర్నియా: మైక్రోసాఫ్ట్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ.. చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న పనోస్ పనాయ్ రాజీనామా చేశారు. ఆయన అమెజాన్‌ హార్డ్‌వేర్‌ బిజినెస్‌ సూపర్‌వైజర్‌గా చేరనున్నారు. పనాయ్ రాజీనామా విచారించదగ్గ విషయమని, కంపెనీ హార్డ్‌వేర్‌, విండోస్ డివిజన్‌లకు తీరని లోటని మైక్రోసాఫ్ట్‌ పేర్కొన్నది. 2004 నుండి పనాయ్ మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నారు.

2012లో మొదటిసారి మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ హార్డ్ వేర్ ఉత్పత్తికి, ప్రాథమికంగా వెలువడిన టాబ్లెట్స్ కూడా సర్ ఫేస్ యూనిట్ నుండే ఉత్పత్తి అయ్యాయి. ఈ సర్ ఫేస్ యూనిట్‌కు పనాయ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ యూనిట్ ద్వారా ఆ తరువాత ల్యాప్ ట్యాప్‌లు, డెస్క్ టాప్‌లు, సంబంధిత విడిభాగాలు కూడా తయారయ్యాయి.

రాజేశ్‌ ఝాకు పనాయ్‌ బాధ్యతలు

పనాయ్ నిర్వహించిన బాధ్యతలను ప్రస్తుతం రాజేశ్‌ ఝాకు అప్పగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. రాజేశ్‌ ఝా ఇప్పటి వరకు ఎక్స్‌పీరియన్స్‌ అండ్ డివైసెస్ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ‘పనాయ్ మీకు అభినందనలు. మీరు చేసిన కృషి మా ఉత్పత్తులపైన, సంస్కృతిపైన, మా పరిశ్రమపైన గత రెండు దశాబ్దాలుగా బలమైన ముద్రవేసింది’ అని నాదెళ్ల తన ప్రకటలో తెలిపారు.

Updated On 19 Sep 2023 11:50 AM GMT
somu

somu

Next Story