Parliament Session | న్యూఢిల్లీ: సెప్టెంబర్ 18-22 తేదీల్లో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చనున్నారు. 17వ లోక్‌సభ 13వ సెషన్, రాజ్యసభ 261వ సెషన్ ఈ తేదీల్లో ఐదు సిటింగ్‌లు నిర్వహిస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. అమృత్‌కాల్‌లో పార్లమెంటులో అర్థవంతమైన చర్చ కోసం ఎదురుచూస్తున్నాను.. అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే, ఏ ఉద్దేశాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారన్న విషయంలో స్పష్టత లేదు. నిజానికి గత సమావేశాల్లో ప్రభుత్వం అన్ని బిల్లులనూ ఆమోదించుకున్న […]

Parliament Session | న్యూఢిల్లీ: సెప్టెంబర్ 18-22 తేదీల్లో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చనున్నారు. 17వ లోక్‌సభ 13వ సెషన్, రాజ్యసభ 261వ సెషన్ ఈ తేదీల్లో ఐదు సిటింగ్‌లు నిర్వహిస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. అమృత్‌కాల్‌లో పార్లమెంటులో అర్థవంతమైన చర్చ కోసం ఎదురుచూస్తున్నాను.. అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అయితే, ఏ ఉద్దేశాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారన్న విషయంలో స్పష్టత లేదు. నిజానికి గత సమావేశాల్లో ప్రభుత్వం అన్ని బిల్లులనూ ఆమోదించుకున్న తర్వాతే అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టింది. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టిన నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఇటీవల మూడు రోజులపాటు దానిపై చర్చలు జరిగాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ఐదు రోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది
