మార్గ‌ద‌ర్శ‌నం చేస్తున్న రాష్ర్ట‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. రైతుల ఉన్న‌తికి ప్ర‌తినిధి ఉపరాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ అని కొనియాడిన ప్ర‌ధాని విధాత‌: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు నిన్న ప్రధాని నేతృత్వంలో అన్ని అఖిల‌పక్ష పార్టీలతో భేటీ జరిగింది. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సహకరించాలని ప్రధాని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం ఈ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లులను, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని విపక్షాలు స్పష్టం చేశాయి. ఇవాళ పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. […]

  • మార్గ‌ద‌ర్శ‌నం చేస్తున్న రాష్ర్ట‌ప‌తి ద్రౌప‌ది ముర్ము..
  • రైతుల ఉన్న‌తికి ప్ర‌తినిధి ఉపరాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ అని కొనియాడిన ప్ర‌ధాని

విధాత‌: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు నిన్న ప్రధాని నేతృత్వంలో అన్ని అఖిల‌పక్ష పార్టీలతో భేటీ జరిగింది. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సహకరించాలని ప్రధాని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం ఈ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లులను, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని విపక్షాలు స్పష్టం చేశాయి. ఇవాళ పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి.

జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రప‌తిగా ఎన్నికైన తర్వాత రాజ్యసభ ఛైర్మన్‌గా జగదీప్‌ తొలిసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మన ఉప రాష్ట్రపతి రైతు పుత్రులు. అంతేగాక సైనిక్‌ పాఠశాలలో చదువుకున్నారు. అందువల్ల జవాన్లు, రైతులతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నది. ఈ అపూర్వమైన సమయంలో ఈ ఎగువసభకు మీలాంటి ప్రతిభావంతమైన వ్యక్తికి నేతృత్వం లభించింది. మీ మార్గదర్శకత్వంలో సభలోని సభ్యులందరూ వారి విధులను సక్రమంగా నిర్వహిస్తారు.

దేశ ప్రజల సంకల్పాన్నిఈ సభ పూర్తి చేసేందుకు పాటుపడుతుంది. గిరిజన సమాజానికి చెందిన మన గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాకు ఇప్పటికే మార్గదర్శనం చేస్తున్నారు. అంతకుముందు కూడా అట్టడుగు వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ అత్యున్నత పదవిని అలంకరించారు. ఇప్పుడు కిసాన్‌ పుత్రులైన మీరు కూడా కోట్లాదిమంది పేదలు, రైతుల ఉన్నతికి ప్రతినిధిగా ఉన్నారని ప్రధాని కొనియాడారు.

Updated On 7 Dec 2022 10:51 AM GMT
krs

krs

Next Story