విధాత: సాధారణంగా చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి రోజునే ఏర్పడుతుంది. ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నాడు ఏర్పడింది. ఈ సంవత్సరంలో ఇదే చివరి గ్రహణం కూడా. తెలంగాణలో సాయంత్రం 5:40 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం.. సాయంత్రం 6:19 గంటల వరకు కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాలు ఈ గ్రహణం కనిపించింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాలు కనిపించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపించింది. ఈ గ్రహణాన్ని చూసేందుకు జనాలు ఆసక్తి […]

విధాత: సాధారణంగా చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి రోజునే ఏర్పడుతుంది. ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నాడు ఏర్పడింది. ఈ సంవత్సరంలో ఇదే చివరి గ్రహణం కూడా. తెలంగాణలో సాయంత్రం 5:40 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం.. సాయంత్రం 6:19 గంటల వరకు కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాలు ఈ గ్రహణం కనిపించింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాలు కనిపించింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపించింది. ఈ గ్రహణాన్ని చూసేందుకు జనాలు ఆసక్తి చూపారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది శని దేవుడి యెుక్క ప్రియమైన తుల, మకరం, కుంభ రాశులకు శుభప్రదంగా ఉండబోతుంది.
తెలంగాణలో పాక్షిక చంద్రగ్రహణం https://t.co/wLHqXoRBN0 pic.twitter.com/faA873cXwk
— vidhaathanews (@vidhaathanews) November 8, 2022
అయితే ఈశాన్య రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. 580 ఏళ్ల తర్వాత తొలిసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్లీ 2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 25వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడిన విషయం విదితమే.
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ఆలయాన్నింటిని మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసిన అనంతరం ఆలయాలను తెరిచారు. గ్రహణం అనంతరం ప్రజలంతా విడుపు స్నానాలు చేశారు..
