విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మత్స్యగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధ శివాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీ సమేత శ్రీ పంచముఖ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం శైవాగమ శాస్త్రానుసారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో సోమవారం రోజు ఉదయం గవ్యాoత పూజలు, రుద్రహోమం, శ్రీ సూక్తహోమం, మహపూర్ణాహుతి నిర్వహించారు.
అనంతరం శ్రీ పార్వతీ సమేత శ్రీ పంచముఖ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అవబృదం, త్రిశూలస్నానం, పుష్పయాగం, పవళింపు సేవ, నీరాజన మంత్రపుష్పములు, తీర్ధ ప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాలయ విగ్రహాల దాత భూపాల్ గౌడ్, పద్మ దంపతులు, అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.