విధాత: చంద్రబాబు మీద, టీడీపీ మీద, ముఖ్యంగా ఎల్లో మీడియా మీద పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నారా. అందుకే ఈ మధ్య ఎక్కడ అలికిడి లేదా. అవునులే ఎందుకు ఉండదు.. కోపంగానే ఉంటాడు.. అందుకే మొన్న గన్నవరం టీడీపీ ఆఫీసు దగ్ధం ఇంకా పట్టాభిని పోలీసులు కొట్టడం వంటి విషయాల్లో సైలెంట్‌గా ఉన్నట్లు జనసైనికులు భావిస్తున్నారు.
వాస్తవానికి టీడీపీకి ఎక్కడైనా డ్యామేజ్.. ఇబ్బంది కలిగితే వెంటనే పవన్ కళ్యాణ్ లైన్లోకి వస్తారు. ట్వీట్స్ చేస్తారు. కుదిరితే వ్యక్తిగతంగా వెళ్లి, ఓదార్చి మద్దతు తెలుపుతారు. పనిలోపనిగా ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తారు. ఆమధ్య కుప్పంలో చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు కూడా ఇలాగె పవన్ ట్వీట్స్ చేశారు. తరువాత విజయవాడ హోటల్లో చంద్రబాబును కలిసి నైతిక సపోర్ట్ కూడా ప్రకటించారు.
పవన్ రేటు ఫిక్స్ ఐనట్టేనా..? పొలిటికల్ కాల్ షీట్స్ వెయ్యి కోట్లా!
కానీ నేడు గన్నవరంలో ఇంత పెద్ద గొడవ జరిగినా ఆయన ఎక్కడా అలికిడి లేదు.. సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకా అంటే ఓ లాజిక్ దొరికింది. మొన్నామధ్య పవన్ ను వెయ్యికోట్లతో కోనేసేందుకు కేసీఆర్ ట్రై చేస్తున్నారని. ఈ మేరకు మధ్యవర్తులు పవన్ను కలిసారని ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. అంటే పవన్ ను ఓ రాజకీయ వ్యాపారి మాదిరి ప్రాజెక్ట్ చేస్తూ ఆ కథనం నడిచింది. దీనికి పవన్ స్పందించలేదు కానీ నాగబాబు మాత్రం స్ట్రాంగ్‌గా టీడీపీకి, ఎల్లో మీడియాలకు కౌంటర్ ఇచ్చారు.
“𝐓𝐨 𝐖𝐡𝐨𝐦 𝐈𝐭 𝐌𝐚𝐲 𝐂𝐨𝐧𝐜𝐞𝐫𝐧” pic.twitter.com/C9mq5BHvNc
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 22, 2023
ఈ విషయంలో పవన్ కోపంగా ఉన్నారని అంటున్నారు. తన ఇమేజిని దెబ్బ తీస్తూ ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్న తరుణంలో ఇక తానెందుకు చంద్రబాబు వద్దకు పోవాలి ? ఎందుకు గన్న వరం ఘటనను గర్హించాలి అని పవన్ ఫీలవుతున్నారట. అంతేకాకుండా ఎల్లో మీడియా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యంతో క్షమాపణ కూడా చెప్పిన చాలని లోలోన పవన్ డిమాండ్ చేస్తున్నట్లు అంటున్నారు.
అందుకే గన్నవరం టిడిపి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన ఘటన మీద ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం ట్వీట్ కూడా చేయలేదని అంటున్నారు. తానూ టిడిపికి ఎంత చేస్తున్నా వాళ్ళు తిరిగి తనను ఇలా పరువు, ప్రతిష్టకు భంగం కలిగించే కథనాలు రాస్తున్నారని ఆయన లోలోన గుర్రు మంటున్నారని తెలుస్తోంది.