ఈనెల 24నుంచి నార‌సింహ యాత్ర ప్రారంభం ప్ర‌జ‌ల ఆశీస్సుల‌కు ముందు, దైవం దీవెన‌ల కోసం ప‌య‌నం విధాత‌: కాశీ, గయ.. తిరుపతి.. భద్రాచలం.. అయోధ్య.. కంచి .. ఇలా 14 యాత్రలు 15 రోజులు అంటూ తీర్థ యాత్రలు చేసే టూర్ ఆపరేటర్ల‌ గురించి విన్నాం.. వారు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ తీర్థాలు చూపించి యాత్రికులను ఆకట్టుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ కు ఎవరు సలహా ఇచ్చారో గానీ మొత్తం 32 దైవ క్షేత్రాలు ద‌ర్శించేలా […]

  • ఈనెల 24నుంచి నార‌సింహ యాత్ర ప్రారంభం
  • ప్ర‌జ‌ల ఆశీస్సుల‌కు ముందు, దైవం దీవెన‌ల కోసం ప‌య‌నం

విధాత‌: కాశీ, గయ.. తిరుపతి.. భద్రాచలం.. అయోధ్య.. కంచి .. ఇలా 14 యాత్రలు 15 రోజులు అంటూ తీర్థ యాత్రలు చేసే టూర్ ఆపరేటర్ల‌ గురించి విన్నాం.. వారు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ తీర్థాలు చూపించి యాత్రికులను ఆకట్టుకుంటారు.

మరి పవన్ కళ్యాణ్ కు ఎవరు సలహా ఇచ్చారో గానీ మొత్తం 32 దైవ క్షేత్రాలు ద‌ర్శించేలా నరసింహ యాత్రను చేపడుతున్నారు. కేసీఆర్‌కు రాజ శ్యామల యాగం చేయాలని పీఠాధిపతులు సలహా ఇచ్చారు. ఆయన అలా యాగం చేయగానే మళ్ళీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి పవన్ ప్లాన్ ఏమిటో.. ఎవరు చెప్పారో గానీ ఇలా యాత్రలకు సిద్ధమయ్యారు.

వాస్తవానికి పవన్ ప్రజల్లోకి వెళ్లేందుకు వారాహి వాహ‌నాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రజాయాత్రల షెడ్యూల్ గురించి ఇక్కడ వివరాలు రాలేదు. కానీ ఈలోపు పవన్ ఇంకో కొత్త యాత్రకు సిద్ధం అయ్యారు. ఈ నెల 24 నుంచి నార‌సింహ‌యాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ‌లోని ధ‌ర్మ‌పురి నార‌సింహ‌స్వామి ఆల‌య సంద‌ర్శ‌న‌తో యాత్ర మొద‌లై… మొత్తం 32 క్షేత్రాల సంద‌ర్శ‌న‌తో పూర్తి అవుతుంది.

ప్ర‌జ‌ల ఆశీస్సుల‌కు ముందు, దైవం దీవెన‌లు పొందాల‌నే ఆలోచ‌న క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల‌పై ప‌వ‌న్‌కు పెద్ద‌గా న‌మ్మ‌కం లేద‌నే సంగ‌తి ఇటీవ‌లే ఆయ‌నే బ‌హిరంగంగా బ‌య‌ట పెట్టుకున్నారు. మీరు ఇంతమంది సభకు వచ్చారు కానీ మీరంతా ఓట్లు వేయరు. మీమీద నాకు నమ్మకం లేదని ఓపెన్ గానే నిష్టూరమాడారు.

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే దేవుళ్ల‌ని, స‌మాజ‌మే దేవాల‌యం అనే డైలాగ్స్ నేత‌ల నుంచి రావ‌డం త‌ర‌చూ వింటుంటాం. కానీ ప‌వ‌న్ మాత్రం గ‌తానుభ‌వాల దృష్ట్యా ప్ర‌జ‌ల్ని మాత్ర‌మే న‌మ్ముకుంటే మునిగిపోతామ‌ని భావిస్తున్నారు. ఈసారి ప్రజా మద్దతుతో బాటు దైవానుగ్రహం ఉండాలని నమ్ముతున్న పవన్ ఇప్పుడు ఏకంగా భారీ యాత్రకు సిద్ధం అయ్యారు.

Updated On 17 Jan 2023 10:52 AM GMT
krs

krs

Next Story