Tuesday, January 31, 2023
More
  Homelatestఆహా: ప‌వ‌న్‌ని ఆటపట్టించిన బాలయ్య..!

  ఆహా: ప‌వ‌న్‌ని ఆటపట్టించిన బాలయ్య..!

  విధాత‌: బాలయ్యకు దాదాపు 100 చిత్రాలకు గాను వచ్చిన క్రేజ్ ఒకే ఒక ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్భీకే షో ద్వారా వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇంతకుముందు ఈయన నారి నారి నడుమ మురారితో పాటు కొన్ని హాస్య భరితమైన పాత్రలు చేశాడు. కెరీర్ ప్రారంభంలోనే జంధ్యాల దర్శకత్వంలో వీరభద్రరావుతో కలిసి బాబాయ్ అబ్బాయ్ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా హాస్యాన్ని పండించాడు. ప‌లు కుటుంబ క‌థా చిత్రాల‌తో హిట్స్ కొట్టారు.

  మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల మావ‌య్య‌, ముద్దుల కృష్ణ‌య్య‌, బాల‌గోపాలుడు వంటి ఫ్యామిలీ ఆడియ‌న్స్ మెచ్చే చిత్రాలు చేశారు. కానీ ఇవేమీ తీసుకురానంత క్రేజ్‌ను బాలయ్యకు ఈ షో ద్వారా లభించింది. ఈ షోకు ముందు బాలయ్యకు ఓవర్సీస్‌లో మార్కెట్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఈ షో పుణ్యమా అని విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా బాలయ్యను తెగ లైక్ చేస్తున్నారు.

  బాలయ్యలోని ఫన్ యాంగిల్‌ను సరికొత్తగా బయటకు తీసుకువచ్చిన టాక్‌ షో ఇది. నేడు దేశంలోని టాప్ టాక్ షోల‌లో ఇది కూడా ఒక‌టి అని ఘంటాప‌థంగా చెప్ప‌వ‌చ్చు. అలాగే బాలయ్య మాటల చాతుర్యం. వాగ్దాటి. ముఖ్య అతిథులను ఆయన వేస్తున్న ప్రశ్నలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

  మరీ ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్, డేటింగ్, లవ్ అంటూ యూత్‌కు బాగా కనెక్ట్ అయిపోయాడు. దాని ప్రభావం వీరసింహారెడ్డి ఓపెనింగ్స్‌పై కూడా బాగా ప్ర‌భావం చూపించింది. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. చిత్రం బిజినెస్ కూడా ఇంతకుముందు కంటే రెండు రెట్లు ఎక్కువగా జరిగింది.

  ఇక ఈయన ఇటీవల ప్రభాస్‌తో పాటు పవన్ కళ్యాణ్‌ను కూడా ముఖ్యఅతిథిగా పిలిచి ఎపిసోడ్స్ చేశాడు. ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదలైంది. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఈ సంక్రాంతికి వస్తుందని అందరూ ఆశించారు. కానీ పలు కారణాల వలన ఈ సీజన్‌కు ఎండింగ్‌లో పవన్ ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ చేయాలని ఆహా భావించడంతో అది కాస్త వాయిదా పడింది.

  ఎపిసోడ్ సంగతి స‌రే కనీసం దీని నుంచి ఒక వీడియో గ్లింప్స్ అయినా వదలండని బాలయ్య, పవన్ అభిమానులు కోరుతున్నారు. వారి అభిమానుల ఒత్తిడి మేరకు సంక్రాంతి సందర్భంగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక క్రేజీ వీడియో గ్లింప్స్‌ ను ఆహా టీం విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ గ్లింప్స్ నిడివి ఒక నిమిషం. ఈ నిమిషమే ఈ వీడియో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

  ఇక ఇందులో పవన్ కళ్యాణ్ ని బాలయ్య ఆటపట్టించాడు. సెట్స్‌లోకి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టిన విజువల్స్, పవన్ బాలయ్య స్టేజిపై ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న సీన్లను ఈ వీడియోలో చూడవచ్చు.

  ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మెజర్మెంట్స్ కొన్ని తీసుకోవాలి అంటూ వేసిన పంచ్ పవర్ స్టార్‌కు బాగా నవ్వు తెప్పించింది. దాంతో పవన్ విరగబడి నవ్వాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో బాలయ్య పవన్ కళ్యాణ్‌ను రాజకీయ ప్రస్థానం, మూడు పెళ్లిళ్లు, పరిటాల రవి గుండు కొట్టించాడ‌నే ప్రచారం మొదలైన క్రేజీ క్వ‌శన్స్ ను అడిగినట్లు తెలుస్తోంది.

  పవన్- బాలయ్య ఎపిసోడ్ పై ఏర్పడిన భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకుంటే దేశంలోనే ఇది బిగ్గెస్ట్ ఎపిసోడ్ కానుంద‌ని ఆహా టీం ఆ లెవల్‌లో ప్రమోట్ చేస్తోంది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular