విధాత‌: మచిలీపట్నంలో జరిగిన పార్టీ ఆవిరభవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిప్పులు చెరిగారు. రాజకీయ గమనం, వ్యూహాలు.. ఎత్తులు.. ఎత్తుగడలు ఇవన్నీ ఎలా ఉన్నా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, తన వ్యక్తిత్వాన్ని తక్కువచేసేలా రాతలు రాసిన ఎల్లో మీడియాకు చెప్పు దెబ్బలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు. మ‌చిలీప‌ట్నం స‌భ‌లో ప‌వ‌న్ ఏమన్నారంటే "వెయ్యి కోట్ల‌పై మాట్లాడితే చెప్పు దెబ్బ గ‌ట్టిగా ప‌డుతుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి నాకు రూ.1000 కోట్ల […]

విధాత‌: మచిలీపట్నంలో జరిగిన పార్టీ ఆవిరభవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిప్పులు చెరిగారు. రాజకీయ గమనం, వ్యూహాలు.. ఎత్తులు.. ఎత్తుగడలు ఇవన్నీ ఎలా ఉన్నా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, తన వ్యక్తిత్వాన్ని తక్కువచేసేలా రాతలు రాసిన ఎల్లో మీడియాకు చెప్పు దెబ్బలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు.

మ‌చిలీప‌ట్నం స‌భ‌లో ప‌వ‌న్ ఏమన్నారంటే

"వెయ్యి కోట్ల‌పై మాట్లాడితే చెప్పు దెబ్బ గ‌ట్టిగా ప‌డుతుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి నాకు రూ.1000 కోట్ల ఆఫ‌ర్ చేశారంట‌. ఆ వెయ్యి కోట్లు ఎక్క‌డున్నాయ‌ని వెతుక్కుంటున్నా. గ‌తంలోనూ ఇలాగే ప్యాకేజీ ఇచ్చారంటే చెప్పు చూపాను. తెనాలికి చెందిన వెంక‌టేశ్వ‌ర‌రావు (Venkateswara Rao) చేసిన చెప్పుల్నే నేను వేసుకుంటా. పిచ్చిపిచ్చిగా వాగితే వాటితో కొడితే గ‌ట్టి దెబ్బ ప‌డుతుంది" అని ప‌వ‌న్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

అంటే కాకుండా తనను అర్థం చేసుకోవాలే త‌ప్ప అపార్థం చేసుకోవ‌ద్ద‌ని కోరారు. త‌న‌ను త‌ప్పు ప‌ట్టిన నాగ‌బాబును కూడా కించ‌ప‌రిచేలా ఆ మీడియాధిప‌తి రాసిన సంగ‌తి తెలిసిందే. ఆమధ్య ఆంధ్రజ్యోతి (Andhra Jyothy) లో ఓ వార్త ప్రచురితం అయింది. పవన్ను తాసనకు మద్దతుదారునిగా చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దానికోసం కొందరు నాయకులతో రాయబేరం పంపారని ఆ కథనంలో పేర్కొన్నారు. అది పవన్ను బాగా హార్ట్ చేసింది. దానికి ఇప్పుడు ఆయన కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

Updated On 15 March 2023 3:11 PM GMT
Somu

Somu

Next Story