Homelatestచచ్చినా.. పవన్‌తో చేయను: ప్రియాంక జవాల్క‌ర్

చచ్చినా.. పవన్‌తో చేయను: ప్రియాంక జవాల్క‌ర్

విధాత‌: పబ్లిసిటీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తరహా. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టుగా ఉంటుంది. కొందరు మాటలతో, మరికొందరు పొగడ్తలతో ప్రసన్నం చేసుకుంటూ తమ పనులు కానిస్తూ ఉంటారు. మరికొందరు అవతలి ఓ స్థాయిలో ఉన్నా వారంటే తమకు లెక్కలేన‌ట్లు నటిస్తూ డోంట్ కేర్ అన్నట్టు ప్రవర్తిస్తూ వారి దృష్టిలో పడాలని తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. ఆ కోవకు చెందిన నటే రాయలసీమ సుందరి ప్రియాంక జవాల్క‌ర్.

హైదరాబాదు నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప‌ట్టా పుచ్చుకుని ఆపై షార్ట్‌ ఫిలింస్‌లో నటిగా ఆకట్టుకుంటుంది. అనంతరం 2017లో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా, సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం, గమనం వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

ఇందులో టాక్సీవాలా, ఎస్ఆర్ కళ్యాణ మండపం, తిమ్మరుసులు విజయవంతం అయినా ఎందుకనో ఈ భామకు సరైన అవకాశాలు దక్కడం లేదు. అప్పటివరకు మడికట్టుకుని ఉన్న ఈ ముద్దుగుమ్మ ఓళ్లు దాచుకోకుండా ఫొటోషూట్‌లు చేసినా ఫలితం దక్కలేదు. దాంతో పవన్ పేరు ప్రస్తావన తెస్తే తనకు పబ్లిసిటీ లభించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతానని భావించిందో ఏమో..! అవకాశం వచ్చినా  పవన్‌ కల్యాణ్‌ సరసన చచ్చినా చేయనంటూ కామెంట్లు చేసింది.

అయితే ఇందుకు బలమైన కారణం ఉందని ఆమె అంటుంది. నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆయనంటే ప‌డి చ‌స్తాను. పవన్ ‘తమ్ముడు’ సినిమాను 20 సార్లు చూశాను. ‘ఖుషీ’ సినిమాలోని ప్రతి డైలాగు నాకు గుర్తుంది. నేను పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఫ్యాన్ ని.

ఆయన్ను అలాగే దూరం నుంచి చూస్తూ అభిమానిగా ఉండిపోవాలని నాకు ఉంది. అంతకుమించి ఇంకేమీ కోరుకోవడం లేదు. ఒకవేళ ఆయనతో సినిమా ఛాన్స్ వచ్చినా చెయ్యను. అంత పెద్ద స్టార్ అయ్యుండి అంత సింపుల్ గా ఎలా ఉంటారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది.

పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతులేస్తారు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందని డేట్స్ సర్దుబాటు చేస్తారు, స్టార్‌డం పొందాలని అనుకుంటారు. కానీ ప్రియాంక మాత్రం విచిత్రంగా పవన్ సినిమాలో అవకాశం వచ్చినా చేయనంటోంది. ఇది కూడా పబ్లిసిటీ కోసమో లేదా మీడియా అటెన్షన్ కోసమో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అయితే ఇక్కడ మరో విశేషముంది పవన్‌ సరసన నటించిన హీరోయిన్లు ఒకరిద్దరు మినహా ఆ తర్వాత సక్సెస్‌ దక్కించుకోలేక పోయారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular