Sunday, December 4, 2022
More
  Homelatestప్యాకేజీ స్టార్ అని అంటే చెప్పుతో కొడతా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

  ప్యాకేజీ స్టార్ అని అంటే చెప్పుతో కొడతా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

  విధాత, మంగళగిరి: వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తనను ప్యాకేజీ స్టార్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరంటూ ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు చేస్తే వైసీసీ నాయుకులను చెప్పు తీసుకోని కొడతానని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

  ఇవాళ్టి నుంచి ఇక యుద్ధమే అని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోందని.. సీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వైసీపీ తాట తీస్తానని వెల్లడించారు. తప్పుడు మాటలు మాట్లాడితే నిలబెట్టి తోలు వలుస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా విడాకులు ఇచ్చి, వారికి తన ఆస్తులు కూడా ఇచ్చి మరొకర్ని పెళ్లి చేసుకున్నానని అన్నారు. ‘చట్ట ప్రకారం విడాకులు ఇచ్చిన వారికి భరణం చెల్లించాను.

  మొదటి భార్యకు రూ.5 కోట్లు ఇచ్చాను. రెండో భార్యకు కూడా నా ఆస్తి రాసిచ్చా. అంతేకానీ, వైఎస్ఆర్ సీపీ నాయకుల మాదిరిగా ఒకర్ని పెళ్లి చేసుకొని 30 మంది స్టెఫినీలతో తిరగడం లేద’ని అన్నారు. ‘వెధవల్లారా ఒక్కొక్కడ్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొడతా’ అని తీవ్రమైన పదజాలంతో దూషించారు.

  ‘‘నాకు రాజకీయం తెలియదనుకుంటున్నారా? ఒక్కొక్కర్నీ నిలబెట్టి తోలు ఒలుస్తా, చెప్పుతో కొడతా కొడకల్లారా!’’ అంటూ పవన్ కల్యాణ్ మరో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా అందరూ పవన్ కల్యాణ్ లోని మంచితనాన్నే చూశారని, ఇకపై తన నుంచి తమ నుంచి యుద్ధమే చూస్తారని తేల్చి చెప్పారు.

  ఈ స్ఫూర్తి తనకు తెలంగాణ పోరాటం నుంచి వచ్చిందని చెప్పారు. తన తండ్రి కూడా అప్పట్లో మంగళగిరి పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలకు మంచిగా చెప్తే వినపడదని అన్నారు.

  నేను స్కార్పియో వాహనాలు కొంటే ఎవరు ఇచ్చారని అడిగారు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. గత 8 ఏళ్లలో నేను ఆరు సినిమాలు చేశాను. వాటి ద్వారా నాకు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. దాని ద్వారా రూ.33 కోట్లకు పైగా ట్యాక్సులు కట్టాను. నా పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తీసి పార్టీ ఆఫీసు కోసం ఇచ్చాం.

  రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.12 కోట్లు ఇచ్చా. అయోధ్య రామాలయం నిర్మాణం కోసం రూ.30 లక్షలు ఇచ్చాను. పార్టీ పెట్టిన దగ్గర నుంచి బ్యాంకు అకౌంట్స్ లో రూ.15.58 కోట్ల కార్పస్‌ ఫండ్‌ డొనేషన్స్ వచ్చాయి. కౌలు రైతు భరోసా యాత్ర కోసం రూ.3.5 కోట్లు వచ్చాయి. నా సేన కోసం నా వంతు పిలుపునకు గానూ మరో రూ.4 కోట్లు అందాయి అని పవన్ తెలిపారు.

  ఒంటి చేత్తో మెడ పిసికి చంపుతా నా కొడకల్లారా. నేను లండన్, న్యూయార్క్‌లో పెరిగాననుకుంటున్నారా? బాపట్లలో పుట్టా.. గొడ్డు కారం తిని పెరిగా. ఒంగోలు గోపాలనగరంలో వీధి బళ్లో చదివా. ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అని మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా కొడకల్లారా. వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. రాడ్‌లతోనా.. హాకీ స్టిక్ లతోనా.. దేంతోనైనా రండి తేల్చుకుందాం.. నేటి నుంచి యుద్ధమే.. అని పవన్ చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది.

  కడుపు కాలితే చేసే పోరాటమే యుద్ధం. ఈ పోరాటం నా గుండెల్లో ఎలా ప్రవేశించిందో తెలుసా? నా గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని నేను ఊరికే చెప్పలేదు. పల్నాటి బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకుని చెప్పా. వైసీపీలోని కాపు నేతలు జగన్‌కు ఊడిగం చేసుకోవచ్చు.. కానీ మొత్తం కాపులను మాత్రం లోకువ చేయడానికి వీల్లేదు అని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page