Sunday, December 4, 2022
More
    Homelatestవిశాఖలో పవన్ నిప్పు రాజేశారా!.. వందల్లో కార్యకర్తల మీద కేసులు

    విశాఖలో పవన్ నిప్పు రాజేశారా!.. వందల్లో కార్యకర్తల మీద కేసులు

    విధాత: విశాఖను రాజధానిగా చేయాలంటూ గర్జన నిర్వహించిన రోజే పవన్ కళ్యాణ్ ర్యాలీ జరపడం. ఆ తరువాత అభిమానులు కాస్తా కంట్రోల్ తప్పి మంత్రుల కార్ల మీద దాడులకు దిగడం.. ఇదంతా ఇంకో కొత్త సమస్యకు.. మరో పరిణామానికి దారి తీస్తోంది. మొత్తానికి బిడ్డ చచ్చినా పురిటికంపు పోలేదు అన్నట్లుగా తయారైంది పవన్ పరిస్థితి.


    ఎయిర్ పోర్టులో మంత్రులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే 300 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పుడు వారిని వెతుకుతున్నారు. గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో భాగంగా మంత్రులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంత్రులు రోజా జోగి రమేష్ టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎయిర్ పోర్టులోకి ప్రవేశించగానే వాళ్ళ కార్లపై హఠాత్తుగా దాడులు జరిగాయి.

    వాస్తవానికి శనివారం సాయంత్రం విశాఖకు చేరుకోగా ఆయన్ను చేసుకోవటానికి జన సైనికులు భారీ ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారంతా మంత్రులను చూస్తూనే వారి కార్లపై దాడులు చేశారు. సీసీ టీవీల ఫుటేజీల ఆధారంగా ఇప్పటివరకు 300 మందిని గుర్తించిన పోలీసులు వారిలో ఇప్పటికి సుమారు 30 మందిని అరెస్టుచేశారు.



    వాళ్ళతో సంబంధం లేదు: పవన్

    శనివారం ర్యాలీ నిర్వహించిన పవన్ ఆదివారం జనవాణి పేరుతో ప్రజలతో దర్బార్ నిర్వహించి సమస్యల మీద వినతులు శ్వీకారించాలని భావించినా పరిస్థితులు ఇబ్బందిగా మారడంతో ప్రజావాణి రద్దు చేశారు.
    అరెస్ట్ అయిన వారిని ప‌వ‌న్ ప‌రామ‌ర్శిస్తార‌ని అంతా అనుకున్నారు. ఆ త‌ర్వాత జ‌న‌వాణిని నిర్వ‌హిస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే అనూహ్యంగా జ‌న‌వాణిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

    ఇదిలా ఉండగా పవన్ సైతం నగరాన్ని వదిలి వెళ్లాలని పోలీసు 41ఏ నోటీసు జారీ చేశారు. అయితే ఆయన ఇంకా నోవాటెల్ హోటల్లోనే ఉన్నారు. అంటే కాకుండా మంత్రుల కార్ల మీద దాడులు చేసింది ఎవరో తమకు సంబంధం లేదని పవన్ పోలీసులకు చెప్పడంతో క్యాడర్ విస్తుపోయింది. అరెస్ట్ అయి కొందరు.. పరారీలో మరి కొందరు ఉండగా వారికి న్యాయ సహాయం చేయాల్సిన పవన్ వారితో తమకు సంబంధం లేదని చెప్పడం ఆయన పిరికితనానికి నిదర్శనం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page