విధాత‌: ముందస్తుగా ప్లాన్ చేసుకుని, స్క్రిప్టు అనుకుని మాట్లాడాడో.. లేక అప్పటికప్పుడు జనాన్ని చూసి ఊపులో మాట్లాడేసాడో తెలీదు. కానీ పవన్ నిన్న రణస్థలంలో యువసత్తా మీటింగ్‌లో చేసిన ప్రసంగం టిడిపి క్యాంపులో టెన్షన్ రేపింది. వాస్తవానికి పవ‌న్ను దాదాపు 30 సీట్లలోపు క్లోజ్ చేసేసి రాష్ట్రం మద్దతు పొందడానికి టిడిపి ప్లాన్ చేసింది. కానీ నిన్నటి పవన్ మీటింగ్ చూస్తుంటే ఆయన తక్కువ బేరానికి లొంగేవాడు కాదన్నట్లుగా అనిపించింది. "మీరు నావెంట ఉంటానని అంటే.. పొత్తులు […]

విధాత‌: ముందస్తుగా ప్లాన్ చేసుకుని, స్క్రిప్టు అనుకుని మాట్లాడాడో.. లేక అప్పటికప్పుడు జనాన్ని చూసి ఊపులో మాట్లాడేసాడో తెలీదు. కానీ పవన్ నిన్న రణస్థలంలో యువసత్తా మీటింగ్‌లో చేసిన ప్రసంగం టిడిపి క్యాంపులో టెన్షన్ రేపింది.

వాస్తవానికి పవ‌న్ను దాదాపు 30 సీట్లలోపు క్లోజ్ చేసేసి రాష్ట్రం మద్దతు పొందడానికి టిడిపి ప్లాన్ చేసింది. కానీ నిన్నటి పవన్ మీటింగ్ చూస్తుంటే ఆయన తక్కువ బేరానికి లొంగేవాడు కాదన్నట్లుగా అనిపించింది.
"మీరు నావెంట ఉంటానని అంటే.. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తా" అంటూ.. పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చాయి.

పొత్తులు పెట్టుకునే వారు ఎవరూ కూడా ప్రజలను అడగాల్సిన అవసరం లేదు. పొత్తులు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు .. దానికి దారి తీసిన పరిస్థితులను వారికి వివరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవన్ మరోసారి ఇలా మాట్లాడడం టిడిపికి తలనొప్పిగా మారింది.

దీంతోబాటు తమకు ఇవ్వాల్సిన సమ ప్రాధాన్యం ఇస్తేనే పొత్తు అని సంకేతం ఇచ్చారు. సమప్రాధాన్యం అంటే ఏమిటి ? సీట్లలో తమకు సగం వాటా కావాలా.. ఎన్ని కావాలి.. పోనీ అది కాకుండా టిడిపి పొత్తుతో అధికారంలోకి వస్తే తమకు ముఖ్యమంత్రి పదవిలో సగం వాటా కావాలా ? అంటే రెండున్న‌రేళ్లు తమకు ఇవ్వాలా.. అసలు పవన్ ఉద్దేశం ఏమిటన్నది తెలియడం లేదు.. మున్ముందు పవన్ ఏమి మాట్లాడతారో చూసి దాన్నిబట్టి ఆయన అభిప్రాయం ఏమిటన్నది ఓ స్పష్టత వస్తుందని అంటున్నారు.

Updated On 13 Jan 2023 11:46 AM GMT
krs

krs

Next Story