HomelatestJanasena, TDP | ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందాం.. పవన్, TDP పొత్తులపై చేగొండి సూచన

Janasena, TDP | ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందాం.. పవన్, TDP పొత్తులపై చేగొండి సూచన

Pawan, TDP alliance |

విధాత‌: టిడిపి జనసేన పొత్తులకు సిద్ధమైనయి… అయితే ఎవరికి ఎన్ని సీట్లు.. ఎన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎన్ని ఎంపీ సీట్లు అన్నది తెలికపోయినా పవన్‌కు దాదాపు పాతిక వరకూ ఎమ్మెల్యే సీట్లు, ఓ మూడు వరకూ ఎంపీ సీట్లు ఇచ్చేలా పవన్, చంద్రబాబుల మధ్య ఒప్పందం కుదిరింది అంటున్నారు. అయితే ఈ పొత్తులు, సీట్ల పంపిణీ మీద కాపులతో బాటు జనసేన కార్యకర్తలు కూడా ఒకింత అసంతృప్తిగా ఉన్నారు.

పవన్ ముఖ్యమంత్రి అయ్యేలా పని చేయాలి కానీ.. చంద్రబాబు జెండా మోయడానికి పవన్ ఎందుకు సిద్ధమవ్వాలి అనేది వారి అభిప్రాయం. ఇదిలా ఉండగానే నరసాపురం మాజీ ఎంపీ, ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య కొత్త ప్రతిపాదనతో కూడిన సూచన చేసారు.

ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. ఆయన మొత్తం రెండు ప్రతిపాదనలు చేసారు. అందులో మొదటిది … చంద్రబాబు సీఎం కావాలని టిడిపి వాళ్ళు కోరుకున్నట్లే పవన్ ముఖ్యమంత్రి కావాలని జనసైనికులు సైతం గట్టిగానే ఆశిస్తున్నారు.

అలాంటపుడు రెండు పార్టీలకూ సమ ప్రాధాన్యం ఉంటేనే ఓట్ల బదిలీ సమగ్రంగా జరుగుతుంది. అంటే సీట్లు సరిగ్గా పంచుకుంటే తప్ప జనసేన ఓట్లు టిడిపికి రావు… అలాగే టిడిపి ఓట్లు జనసేనకు రావు.. కాబట్టి మొత్తం 175 అసెంబ్లీ సీట్లు, పాతిక ఎంపీ సీట్లను రెండు పార్టీలు సమానంగా పంచుకుని పోటీకి దిగాలి. ఆలాగైతేనే అనుకున్న ఫలితం వస్తుంది. అలాకాకుండా టిడిపి సింహభాగం సీట్లు తీసుకుని పవన్ కళ్యాణ్ కు కాసిన్ని సీట్లు పడేస్తే ఖచ్చితంగా కూటమికి ఓటమి తప్పదని, మళ్ళి జగన్ సీఎం అవుతారని ఆయన హెచ్చరించారు.

ఇక రెండో ప్రతిపాదన ఏమంటే చెరిసగం సమానంగా పోటీ చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నిక‌లకు ముందు చెప్పకూడదు. గెలిచాక మాత్రమే అధికారాన్ని కూడా సమానంగా పంచుకుని రెండు పార్టీల మ్యానిఫెస్టోను సమగ్రంగా అమలు చేయాలి.. అప్పుడే ఈ రెండు పార్టీలు అధికారాన్ని చేరగలుగుతాయని చేగొండి సూచించారు.

ఇక మూడో సూచన ఏమంటే చంద్రబాబు కానీ జనసేనకు సమన ప్రాధాన్యం, సీట్లలో ప్రాతినిధ్యం కల్పించని పక్షంలో జనసేన, బీజేపీ, కలిసి పోటీ చేస్తే జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం పెద్ద కష్టం కాదని జోగయ్య చెబుతున్నారు. తెలుగుదేశం, టిడిపిల గ్రాఫ్ తగ్గుతూ వస్తోందని, పవన్ గ్రాఫ్ మాత్రం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో బిజెపితో వెళితే పవన్ కళ్యాణ్ కు విజయం దక్కుతుందని అంటున్నారు.

పవన్‌కు సమాన ప్రాధాన్యం ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరిస్తారా.? సీట్లు కూడా అంత పెద్ద మొత్తంలో ఇస్తారా అన్నది అనుమానమే.. కాబట్టి చంద్రబాబు ఇచ్చినన్ని సీట్లలో సర్దుకుని టిడిపికి సపోర్ట్ చేయడం మినహా పవన్ కు వేరే దారి లేదని అంటున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular