HomelatestPawan Kalyan, YCP fans | AP సోషల్ మీడియా వార్! పవన్, YCP అభిమానుల...

Pawan Kalyan, YCP fans | AP సోషల్ మీడియా వార్! పవన్, YCP అభిమానుల రచ్చ

Pawan Kalyan, YCP fans

విధాత‌: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పెరిగింది.. ఏ చిన్న అవకాశం వచ్చినా ఒకరిని ఒకరు అవమానించి, చిన్నచూపు చూసి ప్రజల్లో చులకన చేసేందుకు అవతలి వారు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ విషయంలో వైసిపి సోషల్ మీడియా ఒకడుగు ముందే ఉంటుంది. అటు పవన్.. ఇటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ సెటైర్లు.. పంచులు.. మీమ్స్ విడుదల చేస్తూ జోరు మీద ఉన్నారు.

పాపం పసివాడు అనే సినిమా పోస్టర్ ను పెట్టీ దానికింద ఓ అబ్బాయి ఓ సూట్ కేసు లాక్కుంటూ వెళ్తున్న జగన్ ఫోటోను పెట్టీ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన జగన్.. సూట్ కేసు కంపెనీలతో రాష్ట్రానికి అరిష్టం పట్టింది.. అన్నీ విధాలా వెనుకబడింది అన్నట్లుగా పోస్ట్ పెట్టీ పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. అయితే దానికి ప్రతిగా వైసిపి అభిమానులు సైతం గట్టిగానే ఎదురుదాడి చేశారు.

చంద్రబాబు సమర్పణలో చిత్రీకరించిన పాపం పసివాడు అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ అనే పిల్లవాడు నాలుగైదు సూట్ కేసులు ఈడ్చుకు పోతున్న ఫోటోను వేశారు. ఆ సూట్ కేసుల నిండా డబ్బు ఉన్నట్లు.. ఆ డబ్బును చంద్రబాబు ఇచ్చినట్లే భావించేలా ఇంకో పోస్టర్ డిజైన్ చేసి పవన్ మీదకు విసిరారు.

దీంతో రెండు పార్టీల అభిమానులు ఒకరిమీద ఒకరు ట్విట్టర్లో దాడులు చేసుకుంటున్నారు. ఒకే సినిమా పోస్టర్ ను ఇద్దరూ వాడుకుని ఒకర్ని ఒకరు బదనాం చేసే పని ముమ్మరంగా చేస్తున్నారు

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular