విధాత‌: రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు(సెర్ప్‌) సర్కారు తీపి కబురు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో వారి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం పేస్కేల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. సెర్ప్ ఉద్యోగులు మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం, పొదుపు పాటించడం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, కుటీర పరిశ్రమలు నెలకొల్పడం, ఆర్థిక అసమానతలను తొలగించడం వంటి కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్ర‌మంలో సెర్ప్ ఉద్యోగుల‌కు ఏప్రిల్ 1 నుంచి పేస్కేలు వ‌ర్తింపజేస్తున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర […]

విధాత‌: రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు(సెర్ప్‌) సర్కారు తీపి కబురు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో వారి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం పేస్కేల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. సెర్ప్ ఉద్యోగులు మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం, పొదుపు పాటించడం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, కుటీర పరిశ్రమలు నెలకొల్పడం, ఆర్థిక అసమానతలను తొలగించడం వంటి కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ క్ర‌మంలో సెర్ప్ ఉద్యోగుల‌కు ఏప్రిల్ 1 నుంచి పేస్కేలు వ‌ర్తింపజేస్తున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సెర్ప్ ఉద్యోగుల క‌నిష్ఠ పేస్కేలు రూ. 19 వేల నుంచి రూ. 58,850లు కాగా, గ‌రిష్ఠ పేస్కేలు రూ. 51,320, రూ. 1,27,310లుగా నిర్ణ‌యించింది ప్ర‌భుత్వం. సెర్ప్ ఉద్యోగుల‌కు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పేస్కేలు వ‌ర్తించ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో సెర్ప్ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నారు.

మండ‌ల్ స‌మాఖ్య క‌మ్యూనిటీ కోఆర్డినేట‌ర్స్ - రూ. 19,000 - 58,850
మండ‌ల్ స‌మాఖ్య క‌మ్యూనిటీ కోఆర్డినేట‌ర్స్‌( మండ‌ల్ రిప్ర‌జెంటెటివ్ ప‌ర్స‌న్స్‌) - రూ. 19,000 - రూ. 58,850
మండ‌ల్ బుక్ కీప‌ర్స్ - రూ. 22,240 - రూ. 67,300
క‌మ్యూనిటీ కో ఆర్డినేట‌ర్స్ - రూ. 24,280 - రూ. 72,850
అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజ‌ర్స్ - రూ. 32,810 - రూ. 96,890
డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజ‌ర్స్ - రూ. 42,300 - 1,15,270
ప్రాజెక్టు మేనేజ‌ర్స్ - రూ. 51,230 - రూ. 1,27,310
డ్రైవ‌ర్స్ - రూ. 22,900 - రూ. 69,150
ఆఫీస్ సబార్డినేట్స్ - రూ. 19,000 - రూ. 58,850
అడ్మినిస్ట్రేష‌న్ అసిస్టెంట్ ప్రాజెక్టు సెక్ర‌ట‌రీస్ - రూ. 24,280 - రూ. 72,850

2001లో అప్పటి ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థను ఏర్పాటు చేసింది. అందులో పనిచేసే వారిని సెర్ప్‌ ఉద్యోగులుగా నాటి ప్ర‌భుత్వం ప్రకటించింది. వీరికి ప్రభుత్వం కేడర్‌ను బట్టి కొంత గౌరవ వేతనాన్ని ఇస్తున్నది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు ఉద్యోగ భద్రత, పే స్కేలు, హెచ్‌ఆర్‌ఏ, డీఏలను అమలు చేయాలని సెర్ప్ ఉద్యోగులు కోరుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచే పోరాటం చేస్తున్నారు. వారి సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్‌.. తప్పకుండా గౌరవం క ల్పిస్తామని అనేకమార్లు ప్రకటించారు. తాజాగా బడ్జెట్‌లో పే స్కేలును అమలు చేస్తూ, అందుకు అవసరమైన నిధులను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యానికి అనుగుణంగా, శ‌నివారం రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Updated On 18 March 2023 1:56 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story