శ్రీ‌యోగ‌పీఠం అధిప‌తి శ్రీ‌యోగ అతిథేశ్వ‌రానంద ప‌ర్వ‌తానంద స్వామి ప్ర‌క‌ట‌న‌ భ‌క్తులంద‌రినీ రాజ‌కీయాల్లో భాగ‌స్వామ్యం చేస్తాం.. విధాత‌: సామాజిక పాల‌న, ఆధిప‌త్యంలో మ‌తాధిప‌తులు, పీఠాధిప‌తుల పాత్ర కొత్త‌దేం కాదు. త‌రత‌రాల చ‌రిత్ర‌లో మ‌తాధిప‌తుల‌దే పాల‌న‌లో పెద్ద‌పీట‌. వీరి క‌నుస‌న్న‌ల్లోనే చ‌క్ర‌వ‌ర్తులు, రాజులు పాల‌న కొన‌సాగించార‌ని తెలుసు. అంటే పాల‌న‌లో మ‌తాధిప‌తుల‌ది బ్యాక్ సీటు డ్రైవింగ్ అన్న‌మాట‌. ఈ మ‌ధ్య తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో కాషాయ వ‌స్త్ర‌దారుల పాత్ర ఎంత కీల‌క‌మైన‌దో మ‌రో సారి అనుభ‌వంలోకి వ‌చ్చింది. ప్ర‌భుత్వాల‌ను […]

  • శ్రీ‌యోగ‌పీఠం అధిప‌తి శ్రీ‌యోగ అతిథేశ్వ‌రానంద ప‌ర్వ‌తానంద స్వామి ప్ర‌క‌ట‌న‌
  • భ‌క్తులంద‌రినీ రాజ‌కీయాల్లో భాగ‌స్వామ్యం చేస్తాం..

విధాత‌: సామాజిక పాల‌న, ఆధిప‌త్యంలో మ‌తాధిప‌తులు, పీఠాధిప‌తుల పాత్ర కొత్త‌దేం కాదు. త‌రత‌రాల చ‌రిత్ర‌లో మ‌తాధిప‌తుల‌దే పాల‌న‌లో పెద్ద‌పీట‌. వీరి క‌నుస‌న్న‌ల్లోనే చ‌క్ర‌వ‌ర్తులు, రాజులు పాల‌న కొన‌సాగించార‌ని తెలుసు. అంటే పాల‌న‌లో మ‌తాధిప‌తుల‌ది బ్యాక్ సీటు డ్రైవింగ్ అన్న‌మాట‌.

ఈ మ‌ధ్య తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో కాషాయ వ‌స్త్ర‌దారుల పాత్ర ఎంత కీల‌క‌మైన‌దో మ‌రో సారి అనుభ‌వంలోకి వ‌చ్చింది. ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌టం, నిల‌బెట్ట‌డం అంతా వారి క‌మండ‌లం లోంచే ఆవిష్క‌రించ‌ బ‌డుతున్న‌ది.

తిరుప‌తిలో త‌మ‌కు ప్ర‌త్యేక దైవ ద‌ర్శ‌న సౌక‌ర్యం క‌ల్పించ‌లేద‌ని 30 పీఠాధిప‌తులు టీటీడీ పాల‌క‌ మండ‌లిపై ఆగ్ర‌హించారు. రాజ‌కీయ నాయ‌కుల‌కు, ధ‌న‌వంతుల‌కు మాత్ర‌మే ప్ర‌త్యేక ద‌ర్శ‌న‌మా అని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.

పీఠాధిప‌తుల‌ను నిర్ల‌క్ష్యం చేసిన ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు తామే ఓ రాజ‌కీయ పార్టీ పెడతామ‌ని విజ‌య‌ వాడ‌కు చెందిన శ్రీ‌యోగ‌పీఠం అధిప‌తి శ్రీ‌యోగ అతిథేశ్వ‌రానంద ప‌ర్వ‌తానంద స్వామి ప్ర‌క‌టించారు. త్వ‌రలోనే 900మంది పీఠాధిప‌తుల‌తో ఓ రాజ‌కీయ పార్టీని స్థాపించి ఈ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్తామ‌ని హెచ్చ‌రించారు.

భార‌త హిందూ మ‌హాస‌భ ద్వారా భ‌క్తులు అంద‌రినీ రాజ‌కీయాల్లోకి తెస్తామ‌న్నారు. అవినీతి మ‌య రాజ‌కీయంలో స్వామీజీల రాజ‌కీయం ఎలా ఉంటుందో త్వ‌ర‌లోనే మ‌న ప‌క్క‌రాష్ట్రం ఏపీలో అనుభ‌వంలోకి రాబోతున్న‌ద‌న్న‌మాట‌!

Updated On 24 Nov 2022 12:59 PM GMT
krs

krs

Next Story