శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలతో కలిసి ముందుకు వెళ్లాల‌ని పిలుపు విధాత, మెద‌క్ బ్యూరో: నిత్యం సవాళ్లతో కూడుకున్న పోలీసు వృత్తికి ఏరోజుకారోజు కొత్తదనం ఉంటుందని, ప్రజల సంతోషాలే మనకు వేడుకలు అవుతాయని జిల్లా ఎస్.పి. శ్రీమతి రోహిణి ప్రియదర్శిని అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపడానికి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్.పి. మాట్లాడారు. ఒక ఏడాది కాలంలో మన జయాపజయాలను బేరీజు వేసుకుని మరింత ఉత్సాహంగా పని చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుందామని అన్నారు. […]

  • శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలతో కలిసి ముందుకు వెళ్లాల‌ని పిలుపు

విధాత, మెద‌క్ బ్యూరో: నిత్యం సవాళ్లతో కూడుకున్న పోలీసు వృత్తికి ఏరోజుకారోజు కొత్తదనం ఉంటుందని, ప్రజల సంతోషాలే మనకు వేడుకలు అవుతాయని జిల్లా ఎస్.పి. శ్రీమతి రోహిణి ప్రియదర్శిని అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపడానికి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్.పి. మాట్లాడారు.

ఒక ఏడాది కాలంలో మన జయాపజయాలను బేరీజు వేసుకుని మరింత ఉత్సాహంగా పని చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుందామని అన్నారు. నిన్నటికన్నా మెరుగైన ఫలితాలు రాబట్టుకునేందుకు, వృత్తి నైపుణ్యాలకు మెరుగు పెట్టుకోవడం, ఆచరణలో పెట్టడానికి ఇటువంటి సందర్భాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

జిల్లా ప్రజలు పోలీసు శాఖ పట్ల స్నేహపూర్వకంగా ఉండడం ఎంతో సంతోషకరమని, ఈ బంధాన్ని పటిష్టపరచడంలో మనం నిరంతరం కృషి చేద్దామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో గతేడాది సాధించిన ఉత్తమ ఫలితాలకు సిబ్బంది చేసిన కృషి అద్వితీయమని, లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళదామని ఎస్.పి. పిలుపునిచ్చారు.

పోలీసు సిబ్బంది, కుటుంబాలు, జిల్లా ప్రజలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు కొత్త ఏడాది ప్రారంభ సూచికగా, సిబ్బందితో కలిసి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో, ఏ.ఆర్ హెడ్ క్వాటర్ నందు ఎస్.పి.కేక్ కటింగ్ చేశారు.

కార్యక్రమంలో సిబ్బందితో కలసి పాల్గొని సంతోషాన్ని పంచుకున్నారు. ఈసందర్భంగా..జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిదులకు, పాత్రికేయులకు పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేసే అన్నీ శాఖల అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.

సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ .బి.బాలస్వామి మెదక్ డిఎస్పీ సైదులు తూప్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, శ్రీ.శ్రీనివాస్ ఆర్.ఐ.నాగేశ్వర్ రావు, ఎస్.బి. సి.ఐ.గోపీనాథ్, ఆర్.ఐ అచ్చుత రావ్ , జిల్లా సి.ఐ లు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు.

Updated On 1 Jan 2023 5:44 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story