Kidney Transplant | విధాత: మనిషికి పంది కిడ్నీ అమర్చిన ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగ సక్సెస్ వైద్య రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. పంది కిడ్నీ అమర్చడంలో గతంలో కన్నా ఎక్కువ రోజులు రెండు నెలల పాటు విజయంతంగా ఒక మనిషి శరీరంలో పని చేయడంతో అవయవాల కొరతను అధిగమించడంలో ఈ ప్రయోగం గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు. గతంలో మానవ శరీరంలో జంతువుల అవయవాలు అమర్చిన ప్రయోగాలు విఫలమవుతూ వచ్చాయి. అయితే జంతువుల ఆర్గాన్స్‌ని […]

Kidney Transplant |
విధాత: మనిషికి పంది కిడ్నీ అమర్చిన ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగ సక్సెస్ వైద్య రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. పంది కిడ్నీ అమర్చడంలో గతంలో కన్నా ఎక్కువ రోజులు రెండు నెలల పాటు విజయంతంగా ఒక మనిషి శరీరంలో పని చేయడంతో అవయవాల కొరతను అధిగమించడంలో ఈ ప్రయోగం గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు.
గతంలో మానవ శరీరంలో జంతువుల అవయవాలు అమర్చిన ప్రయోగాలు విఫలమవుతూ వచ్చాయి. అయితే జంతువుల ఆర్గాన్స్‌ని జన్యుమార్పిడి చేయడం ద్వారా మనుషుల అవయవాల్లాగే పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రయోగ ఫలితాలు మునుముందు వైద్య రంగంలో పెను మార్పులకు దారి తీస్తాయంటున్నారు.
యూఎస్‌లో రెండు నెలల క్రితం బ్రెయిన్ డెడ్ అయిన మిల్లర్ అనే వ్యక్తికి జూలై 14న జన్యు మార్పిడి చేసి విజయవంతంగా పంది కిడ్నీ అమర్చారు. ప్రయోగంలో కిడ్నీ పనితీరును విశ్లేషించేందుకు అతడి శరీరాన్ని రెండు నెలల పాటు వెంటిలేటర్‌పై ఉంచారు.
క్యాన్సర్ కారణగా అవయవాల దానం చేయలేకపోయిన మిల్లర్ డెడ్ బాడి నుంచి పంది కిడ్నీని తీసి శరీరాన్ని అతడి బంధువులకు అప్పగించారు. మనిషి శరీరంలో పంది కిడ్నీ అమరిక ప్రయోగం సక్సెస్ తో బతికి ఉన్న మనుషుల్లోనూ పంది కిడ్నీ అమర్చవచ్చని సంబంధిత వివరాలను అమెరికా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో పంచుకున్నారు.

Surgeons at NYU Langone Health have transplanted a genetically engineered pig kidney that continues to function well after 32 days in a man declared dead by neurologic criteria and maintained with a beating heart on ventilator support. This represents the longest period that a gene-edited pig kidney has functioned in a human, and the latest step toward the advent of an alternate, sustainable supply of organs for transplant.
