HomelatestPM Kisan Samman | రైతన్నకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు..! E-KYC...

PM Kisan Samman | రైతన్నకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు..! E-KYC చేశారా మరి..!

PM Kisan Samman |

దేశానికి అన్నపెట్టే రైతన్న ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. వ్యవసాయం చేసేందుకు పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసినా ప్రకృతి విపత్తుల కారణంగా పెట్టుబడులు కూడా చేతికందని దుస్థితి నెలకొంటున్నది.

ఈ క్రమంలో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఏటా ప్రభుత్వం రైతులకు రూ.6వేలు మూడు విడుతల్లో అందిస్తున్నది. ఇప్పటి వరకు 13 వాయిదాల్లో రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేసింది. ఈ క్రమంలో 14 విడత సాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కేంద్రం ఈ నెల 26 నుంచి 31 మధ్య ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.

మీరు సైతం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి లబ్ధిదారులైతే ఈ సారి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమకానున్నాయి. ఈకేవైసీని రైతులు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి జాబితాలో పేరు ఉందో తనిఖీ చేసుకోవాలి. ఇందు కోసం http://pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ స్త్రీన్‌పై కనిపించిన వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత గెట్‌ రిపోర్ట్‌పై క్లిక్‌ చేయాలి.

అప్పుడు పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇక ఈ కేవైసీ కోసం http://pmkisan.gov.in వెబ్‌సెట్‌కి వెళ్లాలి. అక్కడ హోం పేజీలో ఈ-కేవైసీ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత పక్కనే కనిపించే సెర్చ్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. దాంతో కేవైసీ అప్‌డేట్‌గా ఉంటే.. ఆల్‌రెడీ అప్‌డేటెడ్‌ అని కనిపిస్తుంది.

లేకపోతే ఆధార్‌ కార్డ్‌ నంబర్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయాలి. దాంతో ఈకేవైసీ పూర్తవుతుంది. గతంలో ఆధార్ వివరాలు సరిగా లేవనే కారణంగా పీఎం కిసాన్ సాయం రాకపోతే.. వివరాలను సైతం ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. 13వ విడుతలో కేంద్రం 8 కోట్ల మంది రైతులకు రూ.16,800 కోట్లు ఖాతాల్లో జమ చేసింది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular