PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి మరణంపై భావోద్వేగ ట్వీట్ చేశారు. నిండు నూరేండ్లు పూర్తిచేసుకుని ఈశ్వరుని చెంతకు చేరింది. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆమె విలువలకు కట్టుబడి ఉండే జీవితాన్ని గడిపిందని తెలిపారు.
100వ పుట్టిన రోజు సందర్భంగా అమ్మను కలిసినప్పుడు.. ఆమె ఒక మాట అన్నారు. తెలివితేటలతో, స్వచ్ఛతతో జీవించండి అని అన్నారు. అంటే తెలివితో పని చేయండి, స్వచ్ఛతతో జీవితాన్ని గడపండి అని చెప్పేవారని మోదీ గుర్తు చేశారు.
తన తల్లికి అంకితం చేస్తూ.. ఓ బ్లాగ్ రాశారు మోదీ. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదని.. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు.
రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన హీరాబెన్.. అహ్మదాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3:39 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు యూఎన్ మెహతా హార్ట్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
హీరాబెన్ మోదీ బుధవారం అస్వస్థతకు గురి కావడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. తల్లి ఆస్పత్రిలో చేరగానే, మోదీ నేరుగా అహ్మదాబాద్ వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022