PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నెల 19న వందే భారత్ రైలుతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మోదీ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన కూడా ఖరారైంది. కానీ మోదీ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంవో) వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందించిన పీఎంవో.. మోదీ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే వెల్లడిస్తామని […]

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నెల 19న వందే భారత్ రైలుతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మోదీ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన కూడా ఖరారైంది. కానీ మోదీ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంవో) వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందించిన పీఎంవో.. మోదీ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. మోదీ పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, కొత్త షెడ్యూల్ త్వరలోనే విడుదల అవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ మధ్య 85 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన డబ్లింగ్ రైల్వే లైన్, ఐఐటీ హైదరాబాద్‌లోని అకడమిక్ భవనాలు, హాస్టల్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్ భవనాలు, టెక్నాలజీ రీసెర్చ్ పార్కు, కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్, గెస్ట్ హౌజ్, లెక్చరర్ హాల్ కాంప్లెక్స్ వంటి భవనాలను మోదీ ప్రారంభించాల్సి ఉంది. రూ. 699 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ స్టేషన్‌ను రీడెవలప్‌మెంట్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఆ పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
