PM MODI | విధాత: పండుగ‌ల‌ను, ముఖ్య‌మైన రోజుల‌ను ప్ర‌ధాని మోదీ (Modi in Delhi Metro) వినూత్నంగా జ‌రుపుకొంటార‌న్న విష‌యం తెలిసిందే. గ‌తంలోనూ దీపావ‌ళి వంటి వేడుక‌ల‌ను ఆయ‌న స‌రిహ‌ద్దుల్లో సైనికుల‌తో క‌లిసి చేసుకున్నారు. ఆదివారం (నేడు) ఆయ‌న జ‌న్మ‌దినం . నేటితో ఆయ‌న 73వ ప‌డిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా దిల్లీలోని మెట్రోలో సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో క‌లిసి మోదీ ప్ర‌యాణం చేశారు. దిల్లీ మెట్రోలోని ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగించిన భాగాన్ని ఆదివారం […]

PM MODI |

విధాత: పండుగ‌ల‌ను, ముఖ్య‌మైన రోజుల‌ను ప్ర‌ధాని మోదీ (Modi in Delhi Metro) వినూత్నంగా జ‌రుపుకొంటార‌న్న విష‌యం తెలిసిందే. గ‌తంలోనూ దీపావ‌ళి వంటి వేడుక‌ల‌ను ఆయ‌న స‌రిహ‌ద్దుల్లో సైనికుల‌తో క‌లిసి చేసుకున్నారు. ఆదివారం (నేడు) ఆయ‌న జ‌న్మ‌దినం . నేటితో ఆయ‌న 73వ ప‌డిలోకి అడుగు పెడుతున్నారు.

ఈ సంద‌ర్భంగా దిల్లీలోని మెట్రోలో సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో క‌లిసి మోదీ ప్ర‌యాణం చేశారు. దిల్లీ మెట్రోలోని ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగించిన భాగాన్ని ఆదివారం ప్రారంభించిన మోదీ ఆ లైనులోనే మెట్రోలో ప్ర‌యాణించారు.

దీంతో సంబ‌ర‌ప‌డిపోయిన ప్ర‌యాణికులు ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన చిన్నారుల‌కు ప్ర‌ధాని చాక్లెట్లు సైతం ఇచ్చారు. ప‌లువురు సెల్ఫీల కోసం పోటీ ప‌డ‌గా వారంద‌రికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్, ఎక్స్‌పో సెంట‌ర్‌ను ప్ర‌ధాని ప్రారంభించారు. ద్వార‌క‌లో నిర్మిత‌మైన దీనిని య‌శోభూమి అని కూడా పిల‌వ‌నున్నారు. 73 వేల చ‌.కి.మీ విస్తీర్ణంలో నిర్మిత‌మైన ఈ సువిశాల ప్రాంగ‌ణంలో 15 క‌న్వెన్ష‌న్ రూమ్‌లు, ఒక ప్ర‌ధాన ఆడిటోరియం ఉన్నాయి.

అంతే కాకుండా ఒక పెద్ద బాల్‌రూం, 13 స‌మావేశ మందిరాలను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. చ‌దునైన ఫ్లోర్‌ను అప్ప‌టిక‌ప్పుడు ఆడిటోరియంలా మార్చేసేలా ఆటోమేటిక్ సీటింగ్ సాంకేతిక‌త‌ను ఈ సెంట‌ర్‌లో ఏర్పాటు చేశారు.

Updated On 18 Sep 2023 6:44 AM GMT
krs

krs

Next Story