విధాత‌: పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వంపై విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చోటుచేసుకుంటున్న‌వేళ ప్ర‌ధాని మోదీ (PM Modi) విప‌క్షాల‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని గురువారం తెల్ల‌వారుజామున భార‌త్‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు దిల్లీ విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా.. అక్క‌డ హాజ‌రైన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను ఉద్దేశించి మోదీ ప్ర‌సంగించారు. నేను సిడ్నీలో పాల్గొన్న ప్ర‌వాస భార‌తీయుల కార్య‌క్ర‌మంలో అధికార పార్టీ వారే పాల్గొన‌లేదు. విప‌క్షాల‌కు చెందిన మాజీ ప్ర‌ధానులు, మాజీ మంత్రులు, ఎంపీలు అంద‌రూ పాల్గొన్నారు. […]

విధాత‌: పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వంపై విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చోటుచేసుకుంటున్న‌వేళ ప్ర‌ధాని మోదీ (PM Modi) విప‌క్షాల‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని గురువారం తెల్ల‌వారుజామున భార‌త్‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు దిల్లీ విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

ఈ సంద‌ర్భంగా.. అక్క‌డ హాజ‌రైన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను ఉద్దేశించి మోదీ ప్ర‌సంగించారు. నేను సిడ్నీలో పాల్గొన్న ప్ర‌వాస భార‌తీయుల కార్య‌క్ర‌మంలో అధికార పార్టీ వారే పాల్గొన‌లేదు. విప‌క్షాల‌కు చెందిన మాజీ ప్ర‌ధానులు, మాజీ మంత్రులు, ఎంపీలు అంద‌రూ పాల్గొన్నారు.

అదే ప్ర‌జాస్వామ్యానికి ఉన్న బ‌లం అని వ్యాఖ్యానించారు. ఆయ‌న నేరుగా పార్ల‌మెంటు భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని బాయ్‌కాట్ చేసిన విప‌క్షాల‌ను ప్ర‌స్తావించ‌క‌పోయినా.. వారిని ఉద్దేశించే పై వ్యాఖ్యలు చేశార‌ని తెలుస్తోంది. ఆయ‌న ఇంకా మాట్లాడుతూ.. భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల గురించి మాట్లాడేట‌ప్పుడు బానిస మ‌న‌స్త‌త్వంతో మాట్లాడ‌కండి.

ధైర్యంగా మాట్లాడండి. నేను అలా మాట్లాడేట‌పుడు విదేశాల క‌ళ్ల‌ల్లోకి నేరుగా చూసి మాట్లాడ‌తా.. నాకు స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఇచ్చి అలా ధైర్యంగా మాట్లాడే అవ‌కాశం ఇచ్చింది మీరే.. అని కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. కాగా పార్ల‌మెంటు భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని సుమారు పార్టీలు బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నాయి.

Updated On 25 May 2023 5:11 AM GMT
Somu

Somu

Next Story