విధాత: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ ఆగ్రహ రూపం దాల్చారు. నల్గొండలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జనగణమన నిత్య గీతాలాపన ద్వితీయ వార్షికోత్సవ సదస్సులో లక్ష్మినారాయణ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సదస్సులో కళాశాల విద్యార్థినిలు దేశభక్తి గురించి ఉపన్యాసిస్తుండగా కొందరు పోకిరి కుర్రాళ్లు వెకిలి కామెంట్లు చేయడం గమనించిన లక్ష్మినారాయణ ఒక్కసారిగా వారిపై ఆగ్రహం తో ఊగిపోయారు. విద్యార్థిని లు వేదికపై దేశం గూర్చి మాట్లాడుతూ ఉంటే సిగ్గు శరం లేకుండా […]

విధాత: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ ఆగ్రహ రూపం దాల్చారు. నల్గొండలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జనగణమన నిత్య గీతాలాపన ద్వితీయ వార్షికోత్సవ సదస్సులో లక్ష్మినారాయణ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

సదస్సులో కళాశాల విద్యార్థినిలు దేశభక్తి గురించి ఉపన్యాసిస్తుండగా కొందరు పోకిరి కుర్రాళ్లు వెకిలి కామెంట్లు చేయడం గమనించిన లక్ష్మినారాయణ ఒక్కసారిగా వారిపై ఆగ్రహం తో ఊగిపోయారు. విద్యార్థిని లు వేదికపై దేశం గూర్చి మాట్లాడుతూ ఉంటే సిగ్గు శరం లేకుండా అధ్వానమైన వ్యక్తులుగా మీ వెకిలి వేషాలు, పిల్లికూతలు, కుక్క కూతలతో చిల్లర కామెంట్స్ ఏమిటంటూ పోకిరిలపై మండిపడ్డారు.

వారిని గుర్తించి బయటకు తోసేయమంటూ నిర్వాహకులను ఆదేశించారు. ఏమి సాధించారని గర్వ పడుతున్నారని, మీ ప్రవర్తన విద్యార్థుల మాదిరిగా కనిపించడం లేదంటూ ఆగ్రహించారు. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే లక్ష్మీనారాయణ ఒక్కసారిగా ఆగ్రహానికి గురవడం విస్మయపరిచింది. అనంతరం జేడీ లక్ష్మినారాయణ విద్యార్థుల ను ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.

Updated On 23 Jan 2023 12:05 PM GMT
krs

krs

Next Story