విధాత: యువత జల్సా తనం శృతిమించి జుగుప్సాకరంగా మారుతున్నది. అదే విచ్చలవిడితనంగా మారి చూడటానికే ఇబ్బందికరంగా ఉంటున్నది. విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో ఇలాంటి వికృతమే చోటుచేసుకొన్నది. ద్విచక్రవాహనంపై యువతీ యువకులు అభ్యంతకర తీరులో కూర్చొని రోడ్డుపై పరుగులు తీసిన ఘటన సంచలనాత్మకం అయ్యింది. స్టీల్ సిటీ రోడ్డుపై ఓ యువకుడు తన ద్విచక్రవాహనంపై పెట్రోల్ ట్యాంకుపై ఎదురుగా యువతిని కూర్చుండబెట్టుకొని బండిని పరుగులు పెట్టించాడు. సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే అభ్యంతకరమైన రీతిలో ఆ ఇద్దరూ ప్రయణిస్తున్న తీరు […]

విధాత: యువత జల్సా తనం శృతిమించి జుగుప్సాకరంగా మారుతున్నది. అదే విచ్చలవిడితనంగా మారి చూడటానికే ఇబ్బందికరంగా ఉంటున్నది. విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో ఇలాంటి వికృతమే చోటుచేసుకొన్నది. ద్విచక్రవాహనంపై యువతీ యువకులు అభ్యంతకర తీరులో కూర్చొని రోడ్డుపై పరుగులు తీసిన ఘటన సంచలనాత్మకం అయ్యింది.

స్టీల్ సిటీ రోడ్డుపై ఓ యువకుడు తన ద్విచక్రవాహనంపై పెట్రోల్ ట్యాంకుపై ఎదురుగా యువతిని కూర్చుండబెట్టుకొని బండిని పరుగులు పెట్టించాడు. సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే అభ్యంతకరమైన రీతిలో ఆ ఇద్దరూ ప్రయణిస్తున్న తీరు అదే రోడ్డుపై కారులో పోతున్న వారు వీడియో తీసి ఇది సభ్యతనేనా అన్నట్లు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్‌ అయ్యింది.

ఆ వైరల్‌ వీడియో ఆ కంటా, ఈ కంటా పడి గాజువాక పోలీసుల కంట పడింది. వెంటనే ఆ పోలీసులు యువతీ యువకుల ఆచూకీని కనిపెట్టి ఆ ఇద్దరినీ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తున్నది. అయ్యా యువ పిడుగు గారూ… బండి, స్నేహితురాలు ఎంత నీ సొంతమైనా చుట్టూ సమాజం అనేది ఉన్నది, దానికి ఓ కట్టుబాట్లు, సభ్యత, సంస్కారం అనేవి ఉన్నవని గుర్తించండిరా బాబూ అంటున్నారు విషయం తెలిసిన వారు.

రోడ్లపై ఇలాంటి చేష్టలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు కొందరు. గాజువాక వెంపలినగర్ సమతానగర్‌కు చెందిన యువతీ యువకులు చేసిన అస‌భ్య‌క‌ర విన్యాసం చూస్తుంటే యువ‌త‌పై సినిమా ప్రభావం ఏ రీతిన ఉందో అర్థం అవుతోంది.

Updated On 1 Jan 2023 2:47 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story