Warangal కేయూ పోలీసులకు కమిషనర్ అభినందనలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అర్ధరాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న గర్భిణికి పోలీసులు పెద్ద మనసుతో సాయమందించారు. సమయానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీకి చెందిన గర్భవతికి పురిటి నొప్పులు వచ్చాయి. సోమవారం అర్ధరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో భర్త తో కలిసి ఆస్పత్రికి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వాహనం కోసం ఎదురుచూస్తూ రోడ్డుపైనే ఉండిపోయారు. అదే సమయంలో […]

Warangal
- కేయూ పోలీసులకు కమిషనర్ అభినందనలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అర్ధరాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న గర్భిణికి పోలీసులు పెద్ద మనసుతో సాయమందించారు. సమయానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీకి చెందిన గర్భవతికి పురిటి నొప్పులు వచ్చాయి. సోమవారం అర్ధరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో భర్త తో కలిసి ఆస్పత్రికి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వాహనం కోసం ఎదురుచూస్తూ రోడ్డుపైనే ఉండిపోయారు.
అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు రోడ్డుపై వాహనం కోసం ఎదురుచూస్తున్న గర్భవతిని గమనించారు. కేయూసీ పెట్రోలింగ్ కానిస్టేబుళ్ళు షబ్బీర్, యుగంధర్, వాసు విషయం తెలుసుకుని, తక్షణమే స్పందించారు. గర్భిణితో పాటు భర్తను పెట్రోలింగ్ వాహనంలో సమయానికి ఆస్పత్రిలో చేర్చారు.
ఖాకీ చొక్కా చాటున కారుణ్యం దాగి వుందని వరంగల్ పోలీసులు మరోమారు రుజువు చేశారు. గర్భిణి కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపద సమయంలో గర్భవతిని ఆస్పత్రిలో చేర్పించడంలో చొరవ చూపిన కేయూసీ పెట్రో కార్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు.
