చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద మహిళ హత్య నిందితుడి అరెస్ట్‌.. రిమాండ్‌కు త‌ర‌లింపు.. విధాత: గతేడాది నవంబర్ నెలలో చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద గుర్తు తెలియని మహిళను హత్య చేసి తగలబెట్టిన కేసును సూర్యాపేట పోలీసులు ఛేదించారు. మహిళ ఒంటిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో రెండు బృందాలగా ఏర్పడి మహిళను గుర్తించి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం జిల్లా […]

  • చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద మహిళ హత్య
  • నిందితుడి అరెస్ట్‌.. రిమాండ్‌కు త‌ర‌లింపు..

విధాత: గతేడాది నవంబర్ నెలలో చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద గుర్తు తెలియని మహిళను హత్య చేసి తగలబెట్టిన కేసును సూర్యాపేట పోలీసులు ఛేదించారు. మహిళ ఒంటిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో రెండు బృందాలగా ఏర్పడి మహిళను గుర్తించి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

శనివారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆత్మకూర్(ఎస్) మండలం రామన్న గూడెం గ్రామానికి చెందిన సామ జయమ్మ (60) భర్తతో గొడవ పడి సూర్యాపేటలో తన పిల్లలతో కలిసి నివాసముంటున్నది. ఈ క్రమంలో సూర్యాపేటకు చెందిన ఆర్టీసీలో కాంట్రాక్టు బేసిక్ డ్రైవర్ గా పని చేస్తున్న కొరిపెల్లి సైదులుతో పరిచయం ఏర్పడింది.

కొద్ది రోజుల క్రితం కొంత డబ్బు అవసరమంటూ నెల రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పి జయమ్మ వద్ద 90వేలను సైదులు తీసుకున్నాడు. నిర్ణీత గడువు లోపు తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతో జయమ్మ సైదులు గొడవ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొన్నాడు.

ప‌థ‌కం ప్ర‌కారం జయమ్మను తీసుకొని దూరజ్ పల్లి వద్ద శివారులోని మోడల్ స్కూల్ వెనుక ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ త‌రువాత‌ డబ్బుల విషయంలో మాట మాట పెరిగి జయమ్మను ఆమె చీరతోనే బిగించి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి జయమ్మను తగల పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు.

తన తల్లి మృతదేహం పై పచ్చబొట్టు గుర్తు పట్టిన మృతురాలి కొడుకు జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో వివరాలు తెలపడంతో జయమ్మ పరిచయాలు ఆధారంగా సైదులును అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.

సమావేశంలో సూర్యాపేట రూరల్ సిఐ సోమ్ నారాయణ సింగ్, తుంగతుర్తి సిఐ నాగార్జున, చివ్వేంల ఎస్సై విష్ణు మూర్తి, పెన్ పహాడ్ ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated On 28 Jan 2023 10:57 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story