కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల లొల్లి రేవంత్, కేటీఆర్ పోటాపోటీ పర్యటన ఇరువురు నేతల సవాల్లు ప్రతిసవాల్లు భూపాల్ పల్లి(BHUPALPALLY) జిల్లా కేంద్రంగా రాజకీయ సెగలు పొగలుగక్కుతున్నాయి. కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి జంపైన స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోటీ సాగుతోంది. వీరిద్దరికి మద్దతుగా రాష్ట్రస్థాయి […]

  • కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల లొల్లి
  • రేవంత్, కేటీఆర్ పోటాపోటీ పర్యటన
  • ఇరువురు నేతల సవాల్లు ప్రతిసవాల్లు

భూపాల్ పల్లి(BHUPALPALLY) జిల్లా కేంద్రంగా రాజకీయ సెగలు పొగలుగక్కుతున్నాయి. కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి జంపైన స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోటీ సాగుతోంది. వీరిద్దరికి మద్దతుగా రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు రంగంలోకి దిగి పోటాపోటీ పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పక్షాన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో మొదటి దశ పాదయాత్ర చేపట్టగా, అధికార బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భూపాల్ పల్లిలో పర్యటించి భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Tpcc) భూపాల్ పల్లి లో రెండవ దశ పాదయాత్ర మంగళవారం చేపట్టనున్న నేపథ్యంలో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రమైంది. కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

మొదటి దశ యాత్రతో రగిలిన వేడి

విపక్ష కాంగ్రెస్ నేత (congress leader)గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భూపాల్ పల్లి జిల్లాలో చేపట్టిన హాత్ సే హాత్ జోడోయాత్ర సందర్భంగా ఈనెల 22వ తేదీన పాదయాత్ర నిర్వహించారు. రేగొండ, మొగుళ్ళపల్లి మండలాల్లో పర్యటించారు. మొగుళ్ళపల్లిలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్నర్ మీటింగ్లో టిఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గండ్రపై రేవంత్ ఫైర్

మొగుళ్లపల్లి (Mogullapally)సభలో రేవంత్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. చిన్నారిని కుక్కలు పీక్క తింటే పరామర్శించకుండా, కుక్కలకు ఆపరేషన్లు చేస్తామంటున్న దౌర్భాగ్యపు మంత్రి అంటూ హేళన చేశారు. ప్రజల పట్ల కేటీఆర్ కు ప్రభుత్వానికి సానుభూతి లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే గండ్ర భూఆక్రమణదారుడు, భూములు ఎక్కడ కనిపించినా గండ్ర అక్రమణ చేస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమ సంపాదన, అవినీతికి మారుపేరుగా మారిపోయాడంటూ తీవ్రంగా విమర్శించారు. నీ అభివృద్ధి, నీ ఆదాయం, ఆఖరికి నీ ఎమ్మెల్యేగిరి కూడా కాంగ్రెస్ పెట్టిన బిక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ భూపాల్ పల్లి జిల్లాలో అధికారక పార్టీ లక్ష్యంగా చేసిన తొలి పర్యటనతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

కేటీఆర్ (KTR)భూపాల్ పల్లి పర్యటన

తెల్లవారే ఈనెల 23న భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నేత గండ్రకు మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ భూపాల్‌పల్లిలో పర్యటించారు.

రేవంత్ (REVANTH) పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

భూపాలపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో విపక్షాలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే చిత్తశుద్ధి లేదంటూ విమర్శించారు. దందాకోరు, దళారి రేవంత్ ప్రజా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బ్రోకర్ అంటూ విమర్శించారు.ఎమ్మెల్యే గండ్ర తీవ్రంగా విమర్శించారు. నువ్వు దొంగవు, దగుల్బాజీవి, అక్రమార్కునివి నువ్వా నాకు నీతులు చెప్పేది అంటూ దమ్ముంటే నాపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.

రెండవసారి రేవంత్ పాదయాత్ర నేపథ్యంలో ఉద్రిక్తత

భూపాల్ పల్లిలో రెండవ పర్యాయం (Second time) మంగళవారం చేపట్టిన రేవంత్ రెడ్డి పాదయాత్ర ఫ్లెక్సీలు కట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు తొలగించడంతో ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. రెండు గ్రూపుల మధ్య తోపులాట,వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేశారు. అయినప్పటికీ భూపాల్ పల్లిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు(Police) అప్రమత్తమయ్యారు.

Updated On 28 Feb 2023 8:16 AM GMT
Somu

Somu

Next Story